ముప్పయ్‌ కోట్లకి రూపాయి తగ్గదంటున్న బోయపాటి

ముప్పయ్‌ కోట్లకి రూపాయి తగ్గదంటున్న బోయపాటి

'జయ జానకి నాయక' చిత్రాన్ని ఆగస్టు 11న మరో రెండు క్రేజీ చిత్రాలకి పోటీగా విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్రెయిలర్స్‌తో విశేషంగా ఆకర్షిస్తోన్న 'లై', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలతో పాటు ఈ మాస్‌ మసాలా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. రెండు క్రేజీ చిత్రాలతో పోటీ దేనికని అంటున్నా, బోయపాటి శ్రీను మాత్రం తన సినిమాపై అచంచలమై విశ్వాసంతో వున్నాడట.

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించడంతో ఈసారి స్టార్‌ బలం కూడా లేకపోయినప్పటికీ బోయపాటి మాత్రం ఇది పెద్ద హిట్‌ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడట. ఈ చిత్రం ముప్పయ్‌ కోట్లకి రూపాయి తక్కువ వసూలు చేయదని, అన్నీ కలిసి వస్తే నలభై కోట్ల చిత్రమవుతుందని సన్నిహితులతో చెబుతున్నాడట. బోయపాటి శ్రీను చిత్రాలని విమర్శకులు ఎప్పుడూ చీల్చి చెండాడినా కానీ అవి బాక్సాఫీస్‌ని షేక్‌ చేసాయి.

సరైనోడుతో తెలుగు చలన చిత్ర చరిత్రలో అతి పెద్ద విజయాల్లో ఒకటి అందుకున్న బోయపాటి శ్రీను బ్రాండ్‌ని నమ్మి 'జయ జానకి నాయక'పై బయ్యర్లు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. పోటీ ఎక్కువ వుండడం వల్ల ఇది ఎఫెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ లేదని, దీని ఆడియన్స్‌ దీనికే వుంటారని బోయపాటి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నట్టు, మిగిలిన సినిమాల సంగతి ఎలా వున్నా ఇది మాత్రం ఆగస్టు 11కే విడుదల అవుతుందని టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English