ఆ డైరెక్టర్‌కి క్లాస్‌ పీకిన సీనియర్‌ హీరో

ఆ డైరెక్టర్‌కి క్లాస్‌ పీకిన సీనియర్‌ హీరో

పర్‌ఫెక్షన్‌ కోసం స్క్రిప్ట్‌ స్టేజ్‌లో ఎంత మదనపడినా ఫర్వాలేదు కానీ సెట్స్‌ మీదకి వచ్చిన తర్వాత పర్‌ఫెక్షన్‌ కోసం పాకులాడితే అందరికీ నచ్చదు. అందులోను పాత స్టయిల్‌కి అలవాటు పడ్డ నటుల దగ్గర లాస్ట్‌ మినిట్‌ చెక్కుళ్లు పెట్టుకోకపోతేనే మంచిది. పేరున్న దర్శకులు చెక్కుతున్నా ఊరుకుంటారేమో కానీ యువ దర్శకులు అలాంటి పనులు చేస్తే కరిచేస్తారు.

అలాంటి అనుభవమే ఎదురైందట 'లై' దర్శకుడు హను రాఘవపూడికి. ఈ చిత్రం సెట్స్‌లో హను తరచుగా మార్పులు చేస్తుండేవాడట. సీన్‌ పేపర్‌ ఇచ్చి నటులు డైలాగులు ప్రిపేర్‌ అయిన తర్వాత కూడా మార్చేసేవాడట. నితిన్‌ అయితే దర్శకుడిని ఏమీ అనకుండా ఊరుకునేవాడట కానీ సీనియర్‌ నటుడు అర్జున్‌ మాత్రం అతడిపై ఫైర్‌ అయ్యాడట.

ఒకసారి అయితే హనుని పిలిచి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసి సెట్స్‌ నుంచి వాకౌట్‌ చేసాడని కూడా భోగట్టా. అర్జున్‌కి కోపం రావడంతో అతడిని బుజ్జగించడానికా అన్నట్టు ప్రచారంలో అర్జున్‌కి కూడా నితిన్‌తో సమానంగా వేల్యూ ఇస్తున్నాడని చెప్పుకుంటున్నారు. హను సెట్స్‌ మీద ఎంత మందిని ఇరిటేట్‌ చేసాడో ఏమో కానీ తన సినిమా టీజర్‌తో మాత్రం లక్షల మందిని ఇంప్రెస్‌ చేసేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు