ఛార్మి.. తియ్యని మాటల తూటాలు

ఛార్మి.. తియ్యని మాటల తూటాలు

తెలుగులో మాట్లాడటం కాస్త ఎక్కువగా వచ్చేయడంతో ఈ మధ్య ఛార్మిని కంట్రోల్‌ చెయ్యడం కష్టంగా ఉంది. పైగా అమ్మడు తనకు నచ్చిందే చేస్తానని, నచ్చిందే చెబుతానని ఏదేదో చెబుతుంటే, అవన్నీ వినడానికి కాస్త ఓవర్‌గా ఉన్నాయ్‌. నిన్నకాక మొన్న ఐటెం సాంగులు చెయ్యనని చెప్పేసి, జిమ్ములో చొక్కా పైకెత్తి మరీ తన నాభీ అందాలను జనాలకు చూపించింది.

ఇక తాజాగా నాకు బాగా తిక్క ఉన్న ఒక అబ్బాయి దొరికితే పెళ్ళిచేసుకుంటానని చెప్పి తన తిక్కను మరోసారి చూపించింది. పైగా ఒక గంటలో పెళ్ళిచేసుకోవాలి అనిపిస్తే చేసేసుకుంటుందట. ఇలా తియ్యగా మాటల తూటాలు బాగానే పేలుస్తోంది కాని, వాటికి ఏ పిట్టా పడదని ఛార్మికి అర్ధమవ్వటంలేదు. ఎందుకంటే పది సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్న ఛార్మి ఒక ఓపెన్‌ బుక్‌. నాకు పాతికేళ్ళే అని ఛార్మి ఎంత చెప్పుకున్నా ఆమెకు ఒక స్టార్‌ హీరోయిన్‌ స్టాటస్‌ రావడమనేది కాస్త కష్టమే.

తెలుగు ఇండస్ట్రీలో పాత ఫేస్‌ కన్నా ఫ్రెష్‌ ఫేసులనే ఎక్కువ చూస్తారు. ఏదో బాలీవుడ్‌లో కరీనాకపూర్‌కు ఏడేళ్ళ తరువాత బ్రేక్‌ వచ్చినట్లు అందరికీ అలానే రావాలని లేదుకదా...