నిజాయితీ ఉన్నా, కల్పిత భారతమే!!

నిజాయితీ ఉన్నా, కల్పిత భారతమే!!

ఢీల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన. దీనిని తలుచుకున్నప్పుడల్లా సగటు భారతీయుడికి ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రక్తం ఉడికిపోతుంది. అయితే ఈ సంఘటనను క్యాష్‌ చేసుకోవాలని చాలా మంది సినిమాలు తీసేద్దామంటూ మందుకొచ్చారు. కాని ఎవ్వరూ ఆ నిర్భయ ఘటనను సినిమాగా రూపొందించలేకపోయారు.

బట్‌, మన నారాయణమూర్తి మాత్రం ఏకంగా 'నిర్భయ భారతం' పేరుతో ఒక సినిమాను తీసిపాడేశాడు. అయితే ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ను ఆధారంగా చేసుకొని తీస్తున్నానని చెప్పాడు కాని, సినిమా స్టిల్స్‌ చూస్తుంటే మాత్రం ఏదో అలా అలా చుట్టపాడేసినట్లే ఉంది. ఆయన చేసిన పనిలో నిజాయితీ ఉండొచ్చుకాని, సినిమా మొత్తం కల్పితంలాగా అసహజంగా ఉండే అవకాశం ఉందంటున్నారు విమర్శకులు.

అసలు ఇలా ఒక జాతీయ వృత్తాన్ని ఆసరా తీసుకొని తీస్తున్నామని చెప్పినప్పుడు సినిమా కాస్త రియలిస్టిక్‌గానే ఉండాలి. మరి చూద్దాం మనోడు ఏ టైపులో తీశాడో, ఏ టైపులో నిజాన్ని నిర్భయంగా భారతీయులకు చూపించే ప్రయత్నం చేశాడో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు