టాప్‌ 1 జనతా గ్యారేజ్‌, టాప్‌ 5లో చిరు షో మిస్సింగ్‌!

టాప్‌ 1 జనతా గ్యారేజ్‌, టాప్‌ 5లో చిరు షో మిస్సింగ్‌!

చిరంజీవి బుల్లితెర ఎంట్రీ ఘన విజయం సాధిస్తుందని, చిరంజీవిని చూసేందుకు జనం టీవీ తెరలకి అతుక్కుపోతారని అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి వారంలో బార్క్‌ రేటింగ్స్‌లో టాప్‌ 5లో మిస్‌ అయింది.

టాప్‌ 1 స్థానం జనతా గ్యారేజ్‌ దక్కించుకోగా, మిగిలిన నాలుగు స్థానాలు టీవీ సీరియళ్లకే దక్కాయి. చిరంజీవి ఎంటర్‌ అయ్యారు కనుక టీవీ సీరియళ్లని వదిలిపెట్టి మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్‌ షోకే జనం అంకితమైపోతారని అనుకుంటే సీన్‌ రివర్స్‌ అయింది. షో స్టార్ట్‌ అయిన తొలి వారంలో కూడా చిరంజీవి కోసం జనం ఎగబడకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. నాగార్జున ఈ షో చేసినపుడు తొలి సీజన్‌లో పిచ్చ క్రేజ్‌ వచ్చింది. అయితే ఆ తర్వాతి సీజన్లకి ఆదరణ కరవైంది.

దీంతో హోస్ట్‌ని మారిస్తే మళ్లీ క్రేజ్‌ వస్తుందని భావించారు. అందుకే చిరంజీవిని సంప్రదించి ఆయన అంగీకారం పొందారు. తొలి వారంలోనే చిరంజీవి షోకి నాగార్జున అతిథిగా వచ్చినప్పటికీ, మొదటి పార్టిసిపెంట్‌ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లినప్పటికీ ఈ షో పట్ల ఆసక్తి పుడుతున్నట్టు కనిపించడం లేదు. స్టార్‌ మాటీవీకి ఇది పెద్ద షాకే కనుక ఇప్పుడేం చేస్తే ఈ షో వైపు జనం ఆకర్షితులు అవుతారనే దానిపై దృష్టి పెట్టాలి. లేదంటే హోస్ట్‌ ఎవరైనప్పటికీ వేరెవరో డబ్బులు గెలుచుకుంటూ కూర్చుంటే చూస్తూ కూర్చునే ఓపిక, తీరిక ఎక్కువ మందికి వుండవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు