తమన్నాకు 'పెళ్లి చూపుల'!

తమన్నాకు 'పెళ్లి చూపుల'!

'పెళ్లి చూపుల' కు రెఢీ అయ్యింది మిల్కీ బ్యూటీ. అదేంటి.. ఉన్నట్లుండి ఈ పెళ్లి చూపులేంటన్న డౌట్ అక్కర్లేదు. ఇవి రియల్ పెళ్లిచూపు కావు.. రీల్ పెళ్లిచూపులే. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై చక్కటి వసూళ్లు సాధించిన బుల్లి సినిమా 'పెళ్లిచూపులు'. విజయ్ దేవరకొండ.. రితూవర్మ నటించిన ఈ సినిమా యూత్ ను తెగ అట్రాక్ట్ చేసేసిన విషయం తెలిసిందే.

కథ చెప్పిన విధానం.. సినిమాను తీసిన విధానం ఈ సినిమా విజయవంతం కావటానికి సాయం చేసిందని చెప్పాలి. డైరెక్టర్ ఫిలింగా చెప్పే ఈ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయటానికి ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా రీమేక్ హక్కుల్ని ఆయన సొంతం చేసుకున్నారు.

తన దగ్గర సహాయ దర్శకులుగా వ్యవహరించే సెంథిల్ వీరాస్వామి తమిళ్ రీమేక్ కు దర్శకత్వం చేయనున్నారు. గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖుడి చేతిలో సినిమా హక్కులు వచ్చేయటంతో తమిళ్ వెర్షన్ లో రీతూవర్మ క్యారెక్టర్ మిల్కీ బ్యూటీ తమన్నాకు లభించింది.

స్టార్ హీరోయిన్ నటిస్తున్న ఈ బుల్లిరీమేక్ కు పెద్ద సినిమా ఇమేజ్ వచ్చేయటం.. బిజినెస్ వర్క్ వుట్  కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు