అందరి కళ్లూ ఆయన ఇంట్లో పెళ్లి పైనే..

అందరి కళ్లూ ఆయన ఇంట్లో పెళ్లి పైనే..

గాలి జనార్దన రెడ్డి కూతురి పెళ్లికి 700 కోట్లు ఖర్చు చేశారు.. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత కూడా గాలి అంత స్థాయిలో ఎలా ఖర్చు చేశారు..? మొన్నమొన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లోనూ పెళ్లయింది.. దత్తాత్రేయ కూడా తక్కువేమీ ఖర్చు చేయలేదు.  ఇప్పుడు మరో కేంద్ర మంత్రి ఇంట్లో పెళ్లి బాజా మోగుతోంది. దీంతో విపక్షాలన్నీ తమ నోళ్లకు పనిచెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర రవాణా మంత్రి నితీశ్ గడ్కరీ కుమార్తె పెళ్లి ఈ రోజు ఉండడం.. ఏర్పాట్లు భారీగా ఉండడంతో బీజేపీ విమర్శలకు విపక్షాలు సిద్ధమైపోయాయి.

నోట్లను రద్దు చేయడంతో జనానికి డబ్బు దొరకని సమయం.. చివరకు పెళ్లికి కూడా 2.5 లక్షలకు మించి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేని తరుణంలో ఇలా తన కేబినెట్లోని మంత్రులు కోట్లకు కోట్లు ఖర్చు చేసి పిల్లల పెళ్లిళ్లు చేస్తుండడంతో మోడీ ఇరకాటంలో పడుతున్నారు.

నితిన్‌ గడ్కరీ కుమార్తె కేతకి వివాహం, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆదిత్య కస్కేద్కర్ తో ఈ రోజు నాగపూర్ లో జరగనుంది. అందుకు ఏర్పాట్లు భారీగా ఉన్నాయి.  రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు వీఐపీలు హాజరు కానున్నారు. సంప్రదాయ మహారాష్ట్ర విధానంలో వివాహం జరుగనుండగా, భాజపా చీఫ్ అమిత్‌ షా, కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్, ప్రకాశ్‌ జవదేకర్‌, పియూష్‌ గోయెల్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చత్తీస్ గఢ్ సీఎం రమణ్‌ సింగ్‌, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే తదితరులు పెళ్లికి వెళ్తున్నారు.  8న ఢిల్లీలో జరిగే రిసెప్షన్ కు   ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు వెళ్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు