సునీల్ హీరోయిన్లది మామూలు ర‌చ్చ కాదు

సునీల్ హీరోయిన్లది మామూలు ర‌చ్చ కాదు

మాస్.. ఊర మాస్.. ఇలాంటి ప‌దాలేమీ స‌రిపోవు. త‌న హీరోయిన్ల‌తో వీరూ పోట్ల ఆ స్థాయిలో ర‌చ్చ చేయించాడు. సునీల్ హీరోగా వీరూ తెర‌కెక్కించిన ‘ఈడు గోల్డ్ ఎహే’కు సంబంధించి ఇప్ప‌టికే  రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌లో హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా ప‌నాయ్ ఊర మాస్‌గా క‌నిపించారు. తాజాగా మెకానాస్ గోల్డ్.. అంటూ సాగే పాట టీజ‌ర్ రిలీజ్ చేసింది ‘ఈడు గోల్డ్ ఎహే’ టీం. ఈ పాట‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ హీరోయిన్లే. ఇద్ద‌రూ ఊర మాస్ డ్రెస్సులేసుకుని.. ఊర మాస్ స్టెప్పులేశారు. పొట్టి నిక్క‌ర్ల‌లో రెచ్చిపోయి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఒంపు సొంపుల‌తో ఊపేశారు. ఐటెం భామ‌ల‌క‌న్నా టూమ‌చ్‌గా వాళ్లు విన్యాసాలు చేశారు. వీళ్లు ఎంత ఊపినా.. ఏం చేసినా.. ఇద్ద‌రూ కూడా ఫేస్ వాల్యూ ఉన్న హీరోయిన్లు కాక‌పోవ‌డం మైన‌స్‌.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 7న విడుద‌ల కాబోతోంది ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ సినిమా సునీల్ కెరీర్‌కు చాలా కీల‌కం. ఇప్ప‌టికే వ‌రుస‌గా నాలుగు ఫ్లాపులు ఎదుర్కొన్న సునీల్.. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు. ఐతే పండ‌క్కి పోటీ తీవ్రంగా ఉండ‌బోతోంది. ఇంకో నాలుగు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కొంచెం గ‌ట్టిగానే చేస్తోంది సునీల్ అండ్ కో. టీం అంతా క‌లిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌బోతున్నారు. ద‌స‌రాకు వ‌చ్చే మిగ‌తా సినిమాల‌తో పోలిస్తే మాస్ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యే యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ త‌మ సినిమానే అని.. క‌చ్చితంగా హిట్టు కొడ‌తామ‌ని కాన్ఫిడెంటుగా ఉంది ‘ఈడు గోల్డ్ ఎహే’ టీం. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.

Watch Here:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు