సారొచ్చారు ఫ్లాప్ అని నాల్రోజుల ముందే..

సారొచ్చారు ఫ్లాప్ అని నాల్రోజుల ముందే..

కొన్ని సినిమాలు చూస్తున్నపుడు.. ఇలాంటి సినిమా ఎలా తీశారు.. తీస్తున్నపుడైనా డౌట్ కొట్టలేదా.. రషెస్ చూసుకున్నపుడైనా ఏం అనిపించలేదా అన్న సందేహాలు కలుగుతుంటాయి. ఐతే కొన్నిసార్లు సినిమా ఫ్లాపవుతుందని ముందే అర్థమైనా దర్శక నిర్మాతలు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. తనకు కూడా అలాంటి పరిస్థితే తలెత్తిందిన అంటున్నాడు డైరెక్టర్ పరశురామ్. ఇటీవలే 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న పరశురామ్.. దీనికి ముందు తీసిన 'సారొస్తారా' పెద్ద డిజాస్టర్. గత పదేళ్లలో రవితేజ సినిమాల్లో అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్నది.. అతి త్వరగా థియేటర్ల నుంచి మాయమైంది 'సారొచ్చారు'నే. ఐతే ఈ సినిమా ఫ్లాపవుతుందని తనకు ముందే తెలిసిపోయిందని పరశురామ్ చెప్పాడు.

''నాలుగు రోజుల ముందు 'సారొస్తారు' ఫైనల్ కాపీ చూసుకున్నా. ఆ సినిమా ఆడదని అప్పుడే అర్థమైపోయింది. కానీ ఆ పరిస్థితుల్లో ఏం చేయలేం'' అని పరశురామ్ అన్నాడు. అలాంటి పెద్ద ఫ్లాప్ తర్వాత 'గీతా ఆర్ట్స్' లాంటి పెద్ద సంస్థలో అవకాశం దక్కించుకోవడంపై స్పందిస్తూ.. ''అప్పటికే ఓసారి బన్నీతో సినిమా చేయడానికి ప్రయత్నించాను. కుదర్లేదు. ఐతే నా మిత్రుడైన క్రిష్ బన్నీకి ఓ కథ చెప్పే అవకాశం కల్పించాడు. ఆ కథ విని బన్నీ వాసు ఓకే అన్నాడు కూడా. కానీ అల్లు అరవింద్ గారు పిలిచి బన్నీ బిజీగా ఉన్నాడని.. నాతో శిరీష్ సినిమా చేయాలనుకుంటున్నాడని చెప్పాడు. నేను ఓకే అన్నాను. బన్నీ చెక్కు చేతిలో పెట్టి తమ నమ్మకాన్ని నిలబెట్టమన్నాడు. 'శ్రీరస్తు శుభమస్తు'కు వచ్చిన స్పందన చూసి అల్లు అరవింద్ చాలా సంతోషించి ఆ సంస్థలోనే నాకు మరో సినిమా చేసే అవకాశం కల్పించారు'' అని పరశురామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English