మధ్యలో భలే దూరిపోయాడే..!

మధ్యలో భలే దూరిపోయాడే..!

నిన్నమొన్నటి వరకు కనీసం లెక్కల్లో కూడా లేని సినిమా.. అసలు ఎప్పుడొస్తుందో తెలియని సినిమా.. వార్తల్లో నిలవని సినిమా.. కానీ సడన్‌ గా ఇప్పుడు ఆ సినిమా విడుదల తేదీ అనౌన్స్‌ చేసారు నిర్మాతలు. అదే శ్రీరస్తు శుభమస్తు. అల్లు శిరీష్‌ హీరోగా పరుశురామ్‌ తెరకెక్కించిన ఈ చిత్ర షూటింగ్‌ పూర్తై చాలా రోజులే అయింది. కాకపోతే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులంటూ లేట్‌ చేస్తున్నారు. సరైన విడుదల తేదీ దొరికితే అనౌన్స్‌ చేద్దామని నిర్మాత అల్లు అరవింద్‌ వేచి చూస్తున్నాడు. కబాలి, బాబు బంగారం, జనతా గ్యారేజ్‌ లాంటి పెద్ద సినిమాలుండటంతో శ్రీరస్తు శుభమస్తుపై ఎలాంటి కామెంట్‌ చేయలేదు అల్లు అరవింద్‌. కానీ ఇప్పుడు జనతా గ్యారేజ్‌, బాబు బంగారం పోస్ట్‌ పోన్‌ కావడంతో.. కొడుకు సినిమాను సడన్‌ గా రేస్‌ లోకి తీసుకొచ్చాడు మెగా నిర్మాత.

ముందు అనుకున్న లెక్కల ప్రకారం జులై 22న కబాలి వస్తే.. 29న బాబు బంగారం.. ఆగస్ట్‌ 12న జనతా గ్యారేజ్‌ రావాలి. కానీ ఇప్పుడు జనతా గ్యారేజ్‌ ఆగస్ట్‌ 12 నుంచి సెప్టెంబర్‌ 2కి వెళ్లిపోయింది. జులై 29కి రావాల్సిన బాబు బంగారం ఆగస్ట్‌ 12కి షిఫ్ట్‌ అయింది. ఇక జులై 29కి జక్కన్న వచ్చింది. ఇక ఇప్పుడు జులై 29కి.. ఆగస్ట్‌ 12కి మధ్య మిగిలిన ఒకే ఒక్క తేదీ ఆగస్ట్‌ 5. ఈ తేదీని ఇప్పుడు అల్లు శిరీష్‌ పట్టేసాడు. ఆగస్ట్‌ 5న శ్రీరస్తు శుభమస్తు విడుదల కానుందని అనౌన్స్‌ చేసారు నిర్మాత అల్లు అరవింద్‌. కమర్షియల్‌ హీరోగా గుర్తింపు పొందాలంటే శిరీష్‌ కు ఈ సినిమా విజయం తప్పనిసరి. మరి చూడాలి.. అల్లు వారి చిన్నబ్బాయి ఏం మాయ చేస్తాడో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English