ప్రభాస్ సినిమా గురించి కొత్త ముచ్చట్లు

ప్రభాస్ సినిమా గురించి కొత్త ముచ్చట్లు

ఇప్పటికే మూడేళ్లకు పైగా  ‘బాహుబలి’ సినిమాకు అంకితమై ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంకో ఆరేడు నెలలు ఆ సినిమా పనిలోనే ఉంటాడు. వచ్చే ఏడాది ఆరంభంలో కానీ తన కొత్త సినిమా మొదలుపెట్టేలా లేడు. ఐతే తన రెండో సినిమా చేస్తే ప్రభాస్‌తోనే చేయాలని ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ పట్టుబట్టి అతడి కోసమే వెయిట్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇప్పటికే సుజీత్ ప్రభాస్ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఈ గ్యాప్‌లో అతను కావాలనుకుంటే ఒకట్రెండు సినిమాలు చేసుకుని ఉండొచ్చు. కానీ సుజీత్ మాత్రం అలా రాజీ పడలేదు. ప్రభాస్ సినిమా స్క్రిప్టునే మరింత తీర్చిదిద్దుకున్నాడు. వేరే కథల మీదా దృష్టిపెట్టాడు. ‘బాహుబలి’ సినిమాను ప్రభాస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావించాడో.. ప్రభాస్‌తో సినిమాను అంతే ప్రెస్టీజియస్‌గా భావించాడు సుజీత్.

ఈ మధ్యే తన రెండో సినిమా విషయంలో స్క్రిప్టు ఫైనలైజ్ చేసేశాడట సుజీత్. ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టుల విషయంలోనూ అతను ఓ అవగాహనకు వచ్చేశాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’లో విలన్‌గా చేసి మెప్పించిన నీల్ నితిన్ ముఖేశ్‌ను ప్రభాస్‌కు విలన్‌గా ఫిక్స్ చేశాడట సుజీత్. అలాగే ఈ సినిమాలో బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్‌గా ఫిక్సయింది. ఇది ఓ వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. సుజీత్‌తో ‘రన్ రాజా రన్’ నిర్మించిన ప్రభాస్ మిత్రులు వంశీ, ప్రమోద్ యువి క్రియేషన్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతుండటం వఇవేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు