గ్యాంగ్ లీడర్ రీమేక్.. చిరు ఆశ

గ్యాంగ్ లీడర్ రీమేక్.. చిరు ఆశ

చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ఇప్పుడు చూసినా రిఫ్రెషింగ్‌గా అనిపించే సినిమా అది. ఆ సినిమా విడుదలై మే 9 నాటికి 25 ఏళ్లు పూర్తవడం విశేషం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ‘గ్యాంగ్ లీడర్’ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. పాతికేళ్ల కిందటి అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సైతం ఈ సంబరాల్లో పాలు పంచుకున్నాడు. ‘గ్యాంగ్ లీడర్’లోని ‘‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో. రఫ్ఫాడించేస్తా’’ అనే ఫేమస్ డైలాగ్‌తో డబ్ స్మాష్ చేశాడు చిరు తనయుడు. తన చిన్నతనంలో ‘గ్యాంగ్ లీడర్’ పాటలకు రోజూ డ్యాన్స్ చేస్తూ ఉండేవాడనని.. ముఖ్యంగా టైటిల్ సాంగ్ తన ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఒకటని చరణ్ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. తన తండ్రి కెరీర్లో కొన్ని మైలురాళ్లుగా నిలిచిపోయిన సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటని.. దీన్ని తమ ఫ్యామిలీ ఎప్పటికీ మరిచిపోదని అతనన్నాడు.

మరోవైపు గ్యాంగ్ లీడర్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో చిరంజీవి ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ.. ఈ సినిమాను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. ‘‘గ్యాంగ్ లీడర్ ఇప్పటి పరిస్థితులకు కూడా సూటయ్యే సినిమా. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనరే అయినా.. ఎప్పటికీ తాజాగా అనిపించే సినిమా’’ అని చిరు అన్నాడు. మరి చిరు కోరికను ఆయన తనయుడు నెరవేరుస్తాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English