అమ్మను టైమ్ చూసి కొడుతున్న విజయ్..

అమ్మను టైమ్ చూసి కొడుతున్న విజయ్..

తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్ తర్వాత మాస్ లో ఆ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో విజయ్. ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఏజ్ గ్యాప్ లేకుండా విజయ్ కు ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫాలోయింగ్ నే వాడుకోడానికి ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ట్రై చేసాయి. కానీ విజయ్ మాత్రం న్యూట్రల్ గా ఉన్నాడు. ఎప్పుడూ నోరు తెరిచి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పలేదు. అయితే తమిళనాట అమ్మ జయలలిత.. విజయ్ కు అస్సలు పడదు. విషయం ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గానీ చాలా ఏళ్లుగా విజయ్ తో అమ్మ ఆడుకుంటూనే ఉంది.

 టైమ్ కోసం వేచి చూస్తూ వచ్చిన విజయ్ కు ఇన్నాళ్లకు ఆ టైమ్ పలకరించింది. ఇప్పుడు అరవ నేలపై ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్నాడు విజయ్. అనంతమైన తన ఫ్యాన్ బేస్ కు విజయ్ నుంచి ఓ సూచన వెళ్లిందని సమాచారం. అన్నాడిఎంకే పార్టీకి ఎవ్వరూ ఓటు వేయొద్దనేది దీని సారాంశం. కొన్నేళ్లుగా విజయ్ కు చుక్కలు చూపిస్తోన్న అమ్మకు తన ఫ్యాన్స్ నుంచి షాకివ్వాలని చూస్తున్నాడు విజయ్. పైకి చెప్పకపోయినా.. ఇప్పటికే ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ అంతా కలిసి అన్నాడిఎంకేకు వ్యతిరేకంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తమిళనాట కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. తనకు చుక్కలు చూపిస్తోన్న అమ్మకు ఇప్పుడు తాను చుక్కలు చూపించాలని చూస్తున్నాడు విజయ్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా.. అభిమానుల అండతో అమ్మకు విజయ్ షాకిస్తాడా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు