నాగ్ పాత్రను ఆయన కాదంటే..

నాగ్ పాత్రను ఆయన కాదంటే..

అక్కినేని నాగార్జునకు హ్యాట్రిక్ విజయాన్నందించిన సినిమా ‘ఊపిరి’. ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్‌టచబుల్స్’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. కరణ్ ‘ది ఇన్‌టచబుల్స్’ నిర్మాతల నుంచి కాకుండా పొట్లూరి వరప్రసాద్ నుంచి రైట్స్ తీసుకోవడం విశేషం. ఇండియన్ నేటివిటీకి తగ్గట్లుగా వంశీ పైడిపల్లి చేసిన మార్పులు నచ్చి.. తెలుగు వెర్షన్ నే యథాతథంగా హిందీలో తీయడానికి నిర్ణయించుకున్నాడు కరణ్. ఐతే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్ని ఎవరు పోషిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

నాగార్జున పోషించిన విక్రమాదిత్య పాత్ర కోసం ముందుగా అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నాడు కరణ్ జోహార్. కానీ బిగ్-బి ఈ పాత్ర చేసే విషయంలో కొంచెం సందేహంగా ఉన్నాడట. అమితాబ్ నో చెప్పేస్తే ఆల్టర్నేట్ కూడా చూసుకున్నాడు కరణ్. వరుస హిట్లతో ఊపుమీదున్న అక్షయ్ కుమార్‌ను ఈ పాత్ర కోసం కన్సిడర్ చేస్తున్నాడట. ఐతే ఎనర్జిటిక్‌గా కనిపించే అక్షయ్ ఈ పాత్రలో సూటవుతాడా అన్న డౌట్లున్నాయి. కార్తి పాత్రకు మాత్రం వరుణ్ ధావన్‌ ఫిక్సయిపోయాడు. తమన్నా చేసిన పీఏ పాత్రను ఆమెతోనే చేయిద్దామని చూస్తున్నారట. కాకపోతే హిందీలో తమ్మూ చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే కావడంతో పునరాలోచిస్తున్నారట. ఈ సినిమాకు దర్శకుడెవరో ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతానికి స్క్రీన్ రైటర్లతో స్క్రిప్టు రెడీ చేయిస్తున్న కరణ్.. త్వరలోనే దర్శకుడిని ప్రకటించబోతున్నాడు. జూన్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు