ఆ ముగ్గురినీ పూరి గట్టిగా వాయించేశాడు

ఆ ముగ్గురినీ పూరి గట్టిగా వాయించేశాడు

‘లోఫర్’ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నెలకొన్న వివాదం తీవ్ర రూపమే దాలుస్తోంది. తనపై దాడి చేశారంటూ పూరి జగన్నాథ్ ముగ్గురు డిస్ట్రిబ్యూలర్లపై డిస్ట్రిబ్యూటర్లపై కేసు పెడితే.. అవి తప్పుడు కేసులంటూ డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ పూరికి రిటార్ట్ ఇవ్వడం తెలిసిందే. ఇక లాభం లేదని పూరి కూడా మీడియా ముందుకొచ్చేశాడు. ‘లోఫర్’ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ల భాగోతం ఇదీ అంటూ.. ఆ సినిమా తెర వెనుక జరిగిన కథంతా బయటపెట్టాడు పూరి. ‘లోఫర్’ సినిమా నైజాం హక్కులు రూ.7.5 కోట్లకు కొన్నట్లు చెప్పిన మాట శుద్ధ అబద్ధమని.. నిజానికి ఆ రైట్స్ రూ.3.4 కోట్లు మాత్రమే పలికాయని పూరి చెప్పడం విశేషం. ఇంకా పూరి చెప్పిన సంగతులేంటో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్ నన్ను కలిశారు. వాళ్ల బ్యానర్లో నేను ఐదు సినిమాల చేసేలా ఒప్పందం చేసుకుందామన్నారు. మూడో డిస్ట్రిబ్యూటర్ మత్యాల రాందాస్ ప్రత్యేకంగా తనకో సినిమా చేసిపెట్టాలని అడిగారు. ఐతే ఈ ముగ్గురి ఉద్దేశాలేంటన్నది తర్వాత కానీ నాక తెలియలేదు. నాతో ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని నాపై రుద్దే ప్రయత్నం చేశారు. వాళ్ల నష్టాలకు నన్ను బాధ్యుణ్ని చేయాలని చూశారు. లోఫర్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రెస్ మీట్లో ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అని.. నన్ను నమ్మే లోఫర్ నైజాం హక్కులను రూ.7.5 కోట్లకు కొన్నామని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ సినిమా నైజాం హక్కులు రూ.3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. దీన్ని బట్టే ఆ ముగ్గురూ ఎంత డ్రామా ఆడారో అర్థం చేసుకోవచ్చు’’ అని చెప్పాడు పూరి.

తాను కూడా నిర్మాతనే అని.. తన నిర్మాణంలో వచ్చిన చాలా హిట్ సినిమాలకు బయ్యర్లు ఇవ్వాల్సినంత ఇవ్వలేదని.. కానీ నష్టాలు వచ్చినపుడు మాత్రం తాను క్లియర్ చేశానని పూరి చెప్పాడు. లోఫర్ సినిమాకు తాను దర్శకుడిని మాత్రమేనని.. నష్టాలకు తనను బాధ్యుడ్ని చేయడం సరికాదని అన్నాడు. లోఫర్ కోసం తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్లు పూరి చెప్పాడు. ఐతే లోఫర్ నైజాం హక్కుల్ని రూ.7.5 కోట్లక కొన్నట్ల డిస్ట్రిబ్యూటర్లు అబద్ధమాడితే పూరి ఎందుకు అప్పుడు సైలెంటుగా ఉన్నాడన్నది డౌటు. అప్పుడు మాత్రం అది గొప్పగా అనిపించి.. ఇప్పుడు గొడవ జరిగేసరికి వాస్తవం చెప్పడం సబబేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు