నాగార్జున మీద పెద్ద భారమే

నాగార్జున మీద పెద్ద భారమే

మనం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్లు సాధించిన నాగార్జున ఆ రెండు చిత్రాల బడ్జెట్‌ని చాలా అదుపులో వుంచాడు. ఖర్చు తక్కువ కావడంతో రిస్కు తగ్గిపోయింది. సినిమాలు ఘన విజయాలు సాధించడంతో లాభాలు దండిగా వచ్చాయి. తనకి అంత మార్కెట్‌ వుందన్న సంగతి 'సోగ్గాడే చిన్నినాయనా' అంతటి హిట్‌ అయ్యే వరకు నాగార్జునకు కూడా తెలీదు. ఆ సంగతి ఆయనే ఒప్పుకున్నారు. తన బ్లాక్‌బస్టర్స్‌ని చక్కగా ఆర్కెస్ట్రయిజ్‌ చేసుకున్న నాగార్జునపై ఇప్పుడు పివిపి సినిమా పెద్ద భారమే పెట్టేసారు. 'ఊపిరి' సినిమాపై అరవై రెండు కోట్ల బడ్జెట్‌ పెట్టారని సమాచారం. తెలుగు, తమిళంలో రూపొందిన చిత్రం కనుక బిజినెస్‌ డివైడ్‌ అవుతుంది. అలా అయినప్పటికీ తెలుగు వెర్షన్‌ నుంచే కనీసం నలభై కోట్ల వరకు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

సోగ్గాడే మాదిరిగా మాస్‌ సినిమా కాదు కనుక, నాగార్జున చక్రాల కుర్చీకి పరిమితమయ్యే పాత్ర చేసారు కనుక దీనికి ప్రేక్షకుల స్పందన ఎలాగుంటుందనేది ఊహించడం కష్టం. ప్రశంసల వరకు ఖాయమనుకున్నా కానీ కలక్షన్ల గురించి ఇప్పుడే అంచనాకి రాలేరు. కానీ నాగార్జున తమని గట్టున పడేస్తారని పూర్తి భరోసా ఆయన మీదే పెట్టుకున్నారట. మరి నిర్మాతలు ఊపిరి పీల్చుకునే ఫలితాన్ని నాగ్‌ అందిస్తాడంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు