ప్రణీతకు తప్పిన ప్రాణాపాయం..

ప్రణీతకు తప్పిన ప్రాణాపాయం..

బాపుబొమ్మ ప్రణీతకు ప్రాణాపాయం తప్పింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌ కి వస్తుండగా మోతి గ్రామం దగ్గర  ప్రణీత ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. కానీ అదృష్టం బాగుండి ప్రణీతతో పాటు అంతా ప్రాణాలతో బయటపడ్డారు. యాక్సిడెంట్‌ ఫోటోలు చూస్తుంటే.. పరిస్థితి చాలా భయనకంగా అనిపించింది. కానీ తాను సేఫ్‌ గా ఉన్నానంటూ ట్వీట్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ.

నిన్న ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన సిసిఎల్‌ మ్యాచ్‌ కు హాజరైంది ప్రణీత. అక్కన్నుంచి ఈ రోజు ఉదయం ఖమ్మం వెళ్లి అక్కడో ప్రైవేట్‌ ఫంక్షన్‌ కు హాజరైంది. అక్కన్నుంచి మళ్లీ ఇప్పుడు ఉప్పల్‌ లో జరగబోయే సిసిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కు వస్తుంది ప్రణీత. మార్గ మధ్యలో ఇలా యాక్సిడెంట్‌ అయింది. అయితే ఎవ్వరికీ ఏమీ కాకుండా స్వల్ప గాయాలతోనే బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తన యాక్సిడెంట్‌ ఫోటోలతో పాటు.. తన ఫోటోలు కూడా ట్వీట్‌ చేసింది ప్రణీత. అక్కడ రోడ్డుపై తనను, తన టీంను కాపాడిన వాళ్లకు బిగ్‌ థ్యాంక్యూ అంటూ ట్వీటేసింది ఈ భామ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు