జూనియర్‌తో మల్టీస్టారర్‌ ఇష్టంలేదా?

జూనియర్‌తో మల్టీస్టారర్‌ ఇష్టంలేదా?

ప్రస్తుతం నాట్స్‌ (నార్త్‌ అమెరికన్‌ తెలుగు సొసైటీ) సంబరాల్లో బాలయ్య ఖుషీగా మునకలేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కాజల్‌ సహా ఫోటోలకు తెగ ఫోజిలిచ్చారు ముద్దుల కన్నయ్య. అయితే ఇదే ఉత్సాహంలో ఉన్నప్పుడు విలేకరులు ఓ ప్రశ్న అడిగారట. ‘జూనియర్‌తో కలిసి మల్టీస్టారర్‌ చేసే ఆలోచన ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు ..తల ఎటూ పంకించకుండా..హ్హహ్హహ్మ..అని ఓ నవ్వు నవ్వేశాడట. తనదైన శైలి చిలిపి నవ్వులో ధరహాసాన్ని, బింకాన్ని కనబరిచాడట. ప్రశ్నకు సమాధానం మాత్రం రాలేదు. అయితే ఈ నవ్వులో ఉన్న అర్థాల్ని వెతుక్కోవడం మిగతావాళ్ల వంతు అయింది.

జూనియర్‌తో విభేధాలు ఇంకా తొలగిపోలేదా? అసలు నందమూరి కుటుంబంలో వివాదం ఇంకా సద్దుమనగలేదా? అయినా జూనియర్‌ చేసిన తప్పేంటి పాపం? అని అక్కడున్నవాళ్లంతా ముచ్చటించుకోవడం హైలైట్‌ అయిపోయింది. ఏది ఏమైనా ఈ మధ్యన ఫ్యామిలీలన్నీ మల్లీస్టారర్స్‌ చేస్తున్నాయి కాబట్టి, నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటి చేస్తే పోయేదేముంది...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు