పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో సరికొత్త చిత్రం తెరకెక్కబోతుంది.
క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహా నిర్మాత. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు వీరభద్రం చౌదరి- అనూప్ రూబెన్స్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పాటు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం కోసం వండర్ ఫుల్ క్రైమ్ కామెడీ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు వీరభద్రం చౌదరి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘దర్శకులు వీరభద్రం చౌదరి గారితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. వీరభద్రం చౌదరి గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. కథ చాలా వండర్ ఫుల్ గా వచ్చింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం’ అన్నారు.
హీరో: నరేష్ అగస్త్య
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రం చౌదరి
సంగీతం: అనూప్ రూబెన్స్
బ్యానర్స్ : జయదుర్గాదేవి మల్టీమీడియా& డెక్కన్ డ్రీమ్ వర్క్స్
నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్
సమర్పణ : ఎం. సీ. అనిల్‌రెడ్డి
సహ నిర్మాత: జామి శ్రీనివాసరావు
This post was last modified on May 27, 2022 11:48 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…