ప్రెస్ రిలీజ్

‘విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం ప్రారంభం

వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’. అతను హీరోగా రూపొందుతున్న “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల గారు హీరో విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలియ చేసారు.

ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు ‘విరాట్ రాజ్’. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’. కొద్దిరోజుల క్రితం హీరో విరాట్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలు,వీడియో ప్రశంసలు అందుకున్న విషయ విదితమే.

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ…మాస్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అన్నారు. ‘హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను ‘విరాట్ రాజ్’ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న ‘రవి బస్ రుర్’ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. అలాగే త్రిబుల్ ఆర్ చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్న పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ గారు హీరో కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విజయవంతమైన చిత్రంగా దీనిని మలచటానికి కృషి చేస్తానన్నారు.

వెండితెరకు మరో నట వారసుడు ను తమ
‘వందన మూవీస్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. నవంబర్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని,ఓ మంచి కథతో వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ పరిచయం కావటం సంతోషంగా ఉందన్నారు.

సంగీత దర్శకుడు రవి బస్ రుర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటం ఆనందంగా ఉందన్నారు. కధానాయిక రేవ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు అందించిన ప్రముఖులు నిర్మాత లు ఎ.ఎం.రత్నం,సురేష్ బాబు,దర్శకుడు అనిల్ రావిపూడి, యువ హీరో ఆకాష్ పూరి,రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల గారు లకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంలో కథానాయకుడిగా విరాట్ రాజ్, నాయికగా రేవ, ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కృష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: కాశ్యప్ గోలి; యాక్షన్:
కింగ్ సోలోమన్; ఆర్ట్: రామాంజనేయులు; నృత్యాలు: శేఖర్, జానీ మాస్టర్స్
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: రామాచారి.ఎం
నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె.
బ్యానర్: వందన మూవీస్

This post was last modified on October 20, 2021 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago