ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరిన 100 రోజుల పాలనలో ఒకింత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనక తప్ప లేదు. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. తొలి నెల ఎలా ఉన్నా.. తర్వాత రెండు మాసాలు మాత్రం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం నుంచి వచ్చే సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఇదేసమయంలో వరదలు రావడంతో ప్రజలకు మరింత సాయం చేయాల్సి వచ్చింది. ఇక, పెంచిన పింఛన్లు, అన్న క్యాంటీన్లకు సొమ్ము సర్దుబాటు, ఉద్యోగులకు జీతాలు ఇవన్నీ..తడిసి మోపెడు అయ్యాయి.
అయితే.. తాజాగా కేంద్రం సొమ్ములు అందాయి. పోలవరానికి తాజాగా 2483 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. వీటిని నిర్దేశిత పనులకు కేటాయించాలని.. ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని తేల్చి చెప్పింది. ఈ లెక్కలు, పంచాయతీలు ఎప్పుడూ ఉండేదే. ఉదారంగా ఇచ్చి.. దుబారాగా ఖర్చు చేయాలని ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పదు కదా! సో.. అయితే.. ఇక్కడ ఆహ్వానించదగిన పరిణామం ఏంటంటే.. ముందు మీరు ఖర్చు చేయండి తర్వాత మేం ఇస్తామని కాకుండా.. ఈ సొమ్మును అడ్వాన్సుగా ఇవ్వడం గమనార్హం.
దీంతో పోలవరం పనులు వడివడిగా ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. ఇక, ఇప్పుడు కేంద్ర పన్నుల్లో(జీఎస్టీ) వాటాలు కూడా మోడీ సర్కారు పంచేసింది. దీనిలో ఏపీకి 7,211 కోట్ల రూపాయలు అందాయి. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను తాజాగా కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇన్‌స్టాల్మెంట్ 89,086 కోట్ల రూపాయలతో కలిపి అన్ని రాష్ట్రాలకు మొత్తం 1,78,173 కోట్లను కేంద్రం పంచేసింది. దీంతో ఇప్పుడు ఏపీకి నిధులకు కొరత లేకుండా పోయింది.
మరోవైపు మద్యం వ్యాపారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గేట్లు ఎత్తేయడంతో ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్క దరఖాస్తుకు తిరిగి చెల్లించని రూపంలో అందుతున్న సొమ్ము రూ.2 లక్షలు. ఈ లెక్కన ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు కూడా సర్కారుకు చేరింది. ఇక, మద్యం టెండర్ల తర్వాత.. మరింత సొమ్ము అందనుంది. మొత్తానికి చంద్రబాబుకు ఆర్థిక చింత తీరనుంది.
ఏయే రాష్ట్రాలకు ఎంతెంత?
This post was last modified on October 11, 2024 5:56 pm
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…