కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం.. తీసుకువస్తున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు తాము అనుకూలమని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఏటా వస్తున్న ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రాల జీడీపీ సహా దేశ జీడీపీ కూడా ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాలన్నదే తన అభిమతమని చెప్పారు.
అంతేకాదు.. గతంలో వాజపేయి హయాంలోనూ ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు తొలిసారి తామే అనుకూలంగా సిగ్నల్స్ ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకే సారి ఎన్నికల నిర్వహణ కారణంగా.. దేశ ఖజానాకు కూడా మేలు జరుగుతుందని, ఎన్నికల సంఘంపైనా భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. దేశ పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే.. అన్ని రాష్ట్రాలు ఒకే సమయంలో అభివృద్ది బాటపట్టేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో తమ విజన్ ఇదేనని పేర్కొన్నారు.
ఈ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి కూర్చుని ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాల సంయుక్త సమావేశానికి అవసరం అయితే.. తానే నేతృత్వం వహిస్తానన్నారు. తాజాగా జరిగిన ఢిల్లీ పర్యటనలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పైనా చర్చజరిగినట్టు చంద్రబాబు చెప్పారు. తాజాగా ఆయన విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని దర్శించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ రూపంలో భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా ప్రబుత్వం తరఫున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలూ భంగపడ్డాయని.. ఇప్పుడు వాటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. దీనికి కొంత సమయం పడుతుందని చంద్రబాబు తెలిపారు. మరోవైపు 100 రోజుల పాలనపై వైసీపీ యాగీ చేస్తోందని విమర్శలు గుప్పించారు. వరద సాయం అందరికీ అందిస్తున్నామని.. ప్రతిరూపాయికీ లెక్క ఉందని, వైసీపీ మాదిరిగా దొంగ లెక్కలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
This post was last modified on October 10, 2024 12:27 am
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…