సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెంపలేసుకున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నందుకట. నిజానికి రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ఏదో ఓ స్దాయిలో రెండుపార్టీలు లాభపడతాయి. కానీ విచిత్రమేమిటో రెండుపార్టీలు ఘోరంగా నష్టపోయాయి. అప్పటికే సిపిఐకి ఉన్నదేమీ లేదులేండి కొత్తగా నష్టపోవటానికి. కానీ ఎన్నికలైపోయిన ఏడాదిన్నర తర్వాత పొత్తు పెట్టుకుని తప్పు చేశామని ఇపుడు నారాయణ చెంపలేసుకోవటం ఏమిటో అర్ధం కావటం లేదు.
రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఉపయోగం కనబడలేదు సరే. మరి నారాయణ మాత్రమే ఎందుకు చెంపలేసుకున్నట్లు ? ఎందుకంటే అప్పట్లో తమతో పొత్తుపెట్టుకున్న పవన్ తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకున్నారట. పైగా వ్యవసాయ సంస్కరణల బిల్లుల రూపంలో కేంద్రం రెండు చట్టాలు చేయటాన్ని నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన రెండు చట్టాల వల్ల రైతాంగానికి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్ధం కావటం లేదని కంకణాల నారాయణ తెగ బాధపడిపోయారు. అసలు పవన్ ఎందుకు మోడి కాళ్ళకు మొక్కుతున్నాడో కూడా తమకు అర్ధం కావటం లేదంటూ మండిపోయారు.
ఇక్కడ నారాయణ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రంలోని ఎన్డీఏని నడిపిస్తున్న బిజెపికి జనసేన మిత్రపక్షంగా ఉంది. మిత్రపక్షంగా ఉన్నపుడు జనసేన కేంద్రప్రభుత్వం చేసిన చట్టాలను ఏ విధంగా వ్యతిరేకించగలదు ? జనసేన తరపున ప్రజా ప్రతినిధులు ఎవరు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటులో ప్రజా ప్రతినిధులే లేనపుడు మిత్రపక్షమైనా సరే కేంద్రం జనసేనను ఎందుకు పట్టించుకుంటుంది. బిజెపితో కంటిన్యు అయ్యే అవసరం పవన్ కు ఉంది కాబట్టే కేంద్రం ఏమి చేసినా మాట్లాడటం లేదని తెలిసిపోతోంది. అధికార, ప్రధాన పార్టీలే కేంద్రానికి మద్దతు పలుకుతున్నపుడు ఇక జనసేన ఎంత ?
పైగా మీడియాతో మాట్లాడిన నారాయణ పవన్ వ్యక్తిగత అంశాలను కూడా టచ్ చేశారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కు అసలు వ్యక్తిత్వమే లేదంటూ కామెంట్ చేయటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే సిపిఐతో పొత్తు పెట్టుకునే సమయానికే పవన్ మూడో పెళ్ళి చేసుకున్నారు. అంటే పవన్ కు మూడు పెళ్ళిళ్ళయిన విషయం తెలిసే సిపిఐ పవన్ తో పొత్తు పెట్టుకున్నది. పవన్ గురించి తెలిసీ జనసేనతో సిపిఐ పొత్తు పెట్టుకున్నట్లు ? పనిలో పనిగా మోడి నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకించటం లేదంటూ చంద్రబాబు మీద కూడా బాణాలు సంధించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates