Political News

బిగ్ న్యూస్ : విశాఖ‌కు టీసీఎస్‌.. ఫ‌లించిన లోకేష్ కృషి

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫ‌లించింది. ఆయ‌న మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం చంద్ర‌శేఖ‌ర‌న్‌తో భేటీ అయిన త‌ర్వాత‌.. బుధ‌వారం తీపి క‌బురు చెబుతానంటూ ట్వీట్ చేశారు. అన్న‌ట్టుగానే బుధ‌వారం నారా లోకేష్ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్‌(టీసీఎస్‌)ను ఒప్పించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో విశాఖ‌లో టీసీ ఎస్‌ను  ఏర్పాటు చేసేందుకు టాటా ముందుకు వ‌చ్చిన‌ట్టు చెప్పారు.

ఈ టీసీఎస్‌తో 10 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని నారా లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖ కీర్తి ప్ర‌పంచ దేశాల‌కు కూడా విస్త‌రిస్తుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ గతాన్ని మ‌న‌నం చేసుకున్నారు. తాను నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో అనేక మంది చ‌దువుకున్న యువ‌త త‌మ బాధ‌లు వెల్ల‌డించార‌ని పేర్కొన్నారు. ఉన్న‌త చ‌దువు చ‌దివి పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వ‌స్తోంద‌ని.. దీంతో కుటుంబాల‌కు దూరంగా ఉంటున్నామ‌ని, ఇక్క‌డికే కంపెనీల‌ను తీసుకువ‌చ్చే ఏర్పాటు చేయాల‌ని వారు కోరిన‌ట్టు తెలిపారు.

ఆ స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే.. త‌ప్ప‌కుండా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్స‌హిస్తామ‌ని తాను మాటిచ్చిన ట్టు తెలిపారు. ఆనాడు ఇచ్చిన మాట ప్ర‌కారం.. తాజాగా సీటీఎస్ కంపెనీని ఒప్పించాన‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి ల‌క్ష‌లాది మందికి స్థానికంగా ఉపాధి క‌ల్పిస్తామ‌ని నారా లోకేష్ పేర్కొన్నారు.  ఇదిలావుంటే, మంగ‌ళ‌వా రం నాటి భేటీలో ఏపీలో టీసీఎస్ ఏర్పాటు చేస్తే.. క‌ల్పించే సౌక‌ర్యాల‌ను నారా లోకేష్ వివ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా విశాఖ‌లో కంపెనీని ఏర్పాటు చేసేందుకు సీటీఎస్ ముందుకు వ‌చ్చింది. అదేవిధంగా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌(ఈవీ), ఎయిరో స్పేస్‌, స్టీల్, హోట‌ల్స్, టూరిజం రంగాల్లో కూడా టాటా గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే అవ‌కాశం ఉంది.

This post was last modified on October 10, 2024 12:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

24 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago