నిజానికి సంబంధం లేని వ్యాఖ్యలు. అయినప్పటికీ ఈ రెండు వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నెల కంటే తక్కువ రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార జోరును పెంచేశారు. పోటాపోటీగా సాగుతుున్న ఈ ఎన్నికల ప్రచారంలో ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు వేర్వేరు అంశాల మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారాయి.
ఇంతకూ ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హారిస్ అయితే.. మరొకరు ప్రపంచ కుబేరుడు.. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచిన ట్రంప్ గెలుపే ధ్యేయంగా పని చేస్తున్న ఎలాన్ మస్క్. ఈ ఇద్దరు గెలుపు మీదనే మాట్లాడటం ఒక కామన్ పాయింట్ గా చెప్పాలి. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నయుద్ధంలో శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో శాంతి చర్చల్లో భాగంగా పుతిన్ ను కలుస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. సమస్యే లేదని తేల్చేశారు.
ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఆ దేశమే చెప్పాలన్న కమల.. ఉక్రెయిన్ పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తీరును విమర్శించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్ లోని కైవ్ లో అధికారాన్ని సొంతం చేసుకునే వారన్నారు. దీంతో.. పుతిన్ విషయంలో తాను ఎంత కఠినంగా ఉంటానన్న విషయాన్ని ఆమె చెప్పేశారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ను గెలిపించే వరకు తాను ఆయన వెంటే ఉంటానంటూ ప్రపంచ కుబేరుడు మస్క్ ప్రకటించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయనీ మేరకు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ గెలుపు వరకు ఆయన వెంటే ఉంటానన్న మస్క్.. ఒకవేళ గెలవకపోతే అన్న ప్రశ్నకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ గెలవకుంటే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలుగా పేర్కొన్నారు.
డెమొక్రాట్లు గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా వలసల్ని కొన్ని కీలక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా తాను నమ్ముతానని పేర్కొన్నారు. వారికి పౌరసత్వం లభిస్తే వారంతా డెమొక్రాట్ల ఓటర్లుగా మారుతారని.. మరోనాలుగేళ్లు డెమొక్రాట్లు అమెరికాను పాలిస్తే చట్టవిరుద్ధమైన చర్యల్ని అమలు చేస్తారన్న మస్క్.. ‘స్వింగ్ స్టేట్స్’ కనుమరుగు అవుతాయని విమర్శలు చేశారు. మొత్తంగా కమల.. మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
This post was last modified on October 8, 2024 6:35 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…