నిత్యం పాకిస్థాన్ కవ్వింపులు, ఉక్రమూకల హల్చల్‌తో బిక్కుబిక్కుమనే జమ్ము కశ్మీర్‌లో పాగా వేయాలని.. తమ సత్తా నిరూపించుకోవాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత.. లద్ధాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. మిగిలిన జమ్ము కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా వేరు చేశారు. ఇక్కడే తాజాగా మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లున్న జమ్ము కశ్మీర్‌లో తమకు అధికారం దక్కుతుందని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. లెక్కలేనన్ని సార్లు ఇక్కడ పర్యటించి ప్రచారం కూడా చేశారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మరిన్ని సార్లు ఇక్కడ సభలు పెట్టి.. కశ్మీరీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛ, ఉగ్రవాద నిర్మూలన.. సహా అనేక విషయాలపై ఆయన ఇక్కడ ప్రసంగాలు దంచికొట్టారు. కానీ, ప్రజా తీర్పు మాత్రం భిన్నంగా వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు.
మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కౌంటింగ్ పూర్తయింది. దీని ప్రకారం.. ఎన్సీకి 41 స్థానాలు, కాంగ్రెస్‌కు 9 స్థానాలు దక్కాయి. దీంతో మేజిక్ ఫిగర్ అయిన.. 46 సీట్లను ఈ కూటమి దాటేసింది. ఇక, బీజేపీకి వచ్చేసరికి కేవలం 24 స్థానాలే దక్కాయి. (మొత్తం 56 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది)
ఇక, పీడీపీకి 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 13 చోట్ల విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిని ఏకం చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాలని బీజేపీ చూస్తున్నా.. కాంగ్రెస్+ఎన్సీకి అంతకుమించిన మెజారిటీ ఉండడంతో ఈ సారికి ప్రతిపక్షంలోనే కమల నాథులు కూర్చోవాల్సి వస్తోంది. పైగా.. జమ్ము కశ్మీర్‌లొ దాదాపు 10 ఏళ్ల తర్వాత.. ఎన్నికలు జరగడం విశేషం.
This post was last modified on October 8, 2024 6:29 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…