ప్రత్తిపాటి పుల్లారావు.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, చిలకలూరి పేట ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన గురించి టీడీపీ ఆరా తీస్తోంది. దీనికి కారణం ప్రత్తిపాటి యాక్టివ్‌గా పార్టీలో పాల్గొనకపోవడమే. అసలు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. నెల రోజుల కిందట.. ఆయన సతీమణి వెంకాయమ్మ.. బర్త్ డే సందర్భంగా స్థానిక పోలీసులను ఇంటికి పిలిచి.. వారితో కేకులు తెప్పించుకుని కట్ చేశారన్న విషయం ప్రధాన మీడియాలోనే వచ్చింది.
ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత.. ప్రత్తిపాటి కూడా వివరణ ఇచ్చారు. ఆ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని.. అసలు అక్కడ పోలీసులే లేరని..మీడియా కట్టుకథ అల్లేసిందని ఆయన చెప్పుకొచ్చారు. సరే.. ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది. కానీ, తర్వాత ప్రత్తిపాటి ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? అనేది ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న.
దీనిపై రెండు కారణాలు పార్టీ సీనియర్ల మధ్య చర్చగా నడుస్తున్నాయి. 1) తన కుమారుడిపై వైసీపీ హయాంలో నమోదైన జీఎస్టీ కేసులను రద్దు చేయాలని ప్రత్తిపాటి కోరుతున్నారు. 2) తన సతీమణి వెంకాయమ్మకు నామినేటెడ్ పదవిని అడుగుతున్నారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు టీడీపీ సీనియర్ల మధ్య చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ నమోదుచేసిన కేసులను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, జీఎస్టీ వంటివి కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో నమోదు చేసిన కేసు కావడంతో దీనిని రద్దు చేయడం అనేది ఎంత వరకు సాధ్యమో తెలియదు.
ఈ విషయంపై చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇక, వెంకాయమ్మకు నామినేటెడ్ పదవిని ఇవ్వడాన్ని పార్టీలోని కొందరు విభేదిస్తున్నారు. భర్త మంత్రిగా ఉన్నప్పుడే.. ఆమెను తట్టుకోలేక పోయామని.. ఇప్పుడు నామినేటెడ్ పదవి ఇస్తే.. ఇక, తాము పార్టీని వదిలేయాల్సి వస్తుందని.. కీలక నేతలు ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవి విషయంలో చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సో.. ఈ రెండు అంశాల కారణంగానే ప్రత్తిపాటి మౌనంగా ఉన్నారని.. పార్టీలో యాక్టివ్‌గా లేరని సీనియర్ల వాదన. మరి ఏది నిజమో తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 7, 2024 7:39 am
నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…