Political News

చంద్ర‌బాబుతో కిర‌ణ్ కుమార్‌రెడ్డి భేటీ.. టీడీపీలోకి చేర‌తారా?!

సీఎం చంద్ర‌బాబుతో బీజేపీ నాయ‌కుడు, మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో తాజాగా ఆదివారం ఇరువురు నాయ‌కులు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఈ భేటీ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఏం చ‌ర్చించార‌నే విష‌యాల‌పై రెండు కీల‌క అంశాలు తెర‌మీదికి వ‌చ్చాయి. 1) పార్టీ మారి టీడీపీలోకి చేర‌డం. 2) టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి. ఈ రెండు అంశాల‌పైనే ఇరువురు చ‌ర్చించుకున్నార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని రాజంపేట పార్ల‌మెంటు స్థానం నుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. ఆయ‌న వైసీపీ నాయ‌కుడు, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఎంతో మంది జూనియ‌ర్ నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నా.. త‌న సొంత గ‌డ్డ‌పై కిర‌ణ్ ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీలోను.. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలోనూ కేంద్రంలోని బీజేపీకి వ‌ర్త‌మానాలు పంపించారు. కానీ, స్పందించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో కొన్నాళ్లుగా కిర‌ణ్‌కుమార్ రెడ్డి బీజేపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం త‌గ్గించారు. అంతేకాదు.. టీడీపీ నేత‌లు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌టితోనే క‌థ అయిపోలేదు. ఏవేదిక ఎక్కినా.. చంద్ర‌బాబు పాల‌న తీరును ఆయ‌న ప్ర‌శంసిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ కూడా అధికారంలోనే ఉంది. అయినా.. దానిని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా.. చంద్ర‌బాబు ను మాత్ర‌మే హైలెట్ చేస్తూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో తాజా చ‌ర్చ‌ల వెనుక ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకునే అభిప్రాయం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ప్ర‌స్తుతం కిర‌ణ్ సోద‌రులు న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ త‌ర‌ఫున పీలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం ద‌క్కించుకున్నారు. ఎలానూ సోద‌రుడు టీడీపీలోనే ఉన్నారు కాబ‌ట్టి.. ఆయ‌న చేరినా ఆశ్చ‌ర్యం లేదు. ఇక‌, మ‌రో కీల‌క అంశం టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి. ఈ ప‌ద‌వి కోసం చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా కిర‌ణ్ కుమార్‌రెడ్డి కూడా ఈ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నా రు. అందుకే నేరుగా చంద్ర‌బాబును క‌లిసి అభ్య‌ర్థించి ఉంటార‌న్న చ‌ర్చ‌కూడా న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 6, 2024 9:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

29 minutes ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

1 hour ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

1 hour ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

2 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

2 hours ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

4 hours ago