తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనూ.. పదేళ్ల తర్వాత జమ్ము కశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు తాజాగా ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ విజయం దక్కించుకోవడం ద్వారా మోడీ తన హవాను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక పథకాలు కూడా ప్రకటించారు. మొత్తం జమ్మూ కశ్మీర్‌లో మూడు దశలు, హరియాణాలో ఒక విడతలోనూ పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 8న కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితం రెండూ రానున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన దరిమిలా.. ఎగ్జిల్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. వీటి ప్రకారం.. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో కమల నాధులకు భారీ ఎదురు దెబ్బతగిలే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం గమనార్హం. హరియాణాలో కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం దక్కించుకుంటుందని సంస్థలు పేర్కొన్నాయి. ఇది మోడీ సర్కారుకు తీవ్ర సంకటంగా మారనుంది. ఎందుకంటే.. దీనికి ఆనుకుని ఉన్న ఢిల్లీలోనూ త్వరలోనే ఎన్నికలు రానున్నాయి.
ఢిల్లీలో హరియాణా ఎన్నికల ఫలితం తాలూకు ప్రభావం పడనుంది. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు ఎగ్జిట్ పోల్స్‌పై మౌనం పాటి స్తున్నారు. ఇదిలావుంటే, జమ్ము కశ్మీర్‌పైనా బీజేపీ అనేక ఆశలు పెట్టుకుంది. ఉగ్రవాదం నిర్మూలన, పాకిస్తాన్ దూకుడుకు బ్రేక్ వేసిన నేపథ్యంలో మోడీ హవా జోరుగా ఉంటుందని కమల నాథులు భావించారు. కానీ, ఇక్కడ ప్రజా తీర్పునకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకీ మెజారిటీ దక్కడం లేదు. దీంతో జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఎగ్జిట్ పోల్సు చెబుతున్నాయి. ఇక్కడ.. ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చాటి చెప్పడం గమనార్హం.
1) హరియాణా(మొత్తం 90 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్: పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ – 55, బీజేపీ – 26. ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ – 1, సట్టా బజార్ సర్వే: కాంగ్రెస్ – 50, బీజేపీ – 25, ఏబీపీ-సీ ఓటర్ సర్వే: బీజేపీ – 78, కాంగ్రెస్ -8, న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ సర్వే: బీజేపీ – 75, కాంగ్రెస్ -10 స్థానాల్లో విజయం దక్కించుకుంటాయని పేర్కొన్నాయి.
2) జమ్మూ కశ్మీర్ (మొత్తం 90 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్: పీపుల్స్ పల్స్: జేకేఎన్ సీ(జమ్ము కశ్మీర్ నేషనల్ కాంగ్రెస్) -33-35, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, జేకే పీడీపీ 7-11, ఏఐపీ 1, ఇతరులు 4-5, రిపబ్లిక్ మాట్రిజ్ సర్వే: బీజేపీ -25, కాంగ్రెస్ -12, ఎన్సీపీ- 15, పీడీపీ -28, ఇతరులు – 7 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ 46 స్థానాలు వస్తే తప్ప.. అధికారం దక్కించుకునే అవకాశం ఏ పార్టీకీ లేదు. దీంతో ఈ సర్వేలు నిజమైతే సంకీర్ణం ఖాయం.
This post was last modified on October 6, 2024 3:19 pm
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…
కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…
టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ…
పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్…