అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అంటూ.. కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో నాయకులకు అవకాశం కూడా కల్పించలేదు. బలమైన వర్గాలను కూడా పార్టీకి దూరం చేశారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పార్టీని నడిపించారు. అయితే.. వారు అనుకున్నట్టుగా.. వారు ఊహించుకున్న ట్టుగా.. ఎన్నికల ఫలితం రాలేదు. అంతా తలకిందలు అయిపోయింది. ఈ పరిణామం.. సదరు చక్రం తిప్పిన నాయకులకు ఎలా ఉన్నా.. పార్టీకి మాత్రం తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది.
ఇలాంటి పరిణామమే ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీలో కనిపిస్తోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడ చివరి రెండున్నరేళ్లు రెచ్చిపోయారు. అంతా తానే అయి చక్రం తిప్పారు. ఫలితంగా అప్పటి వరకు బలమైన వాయిస్ వినిపించిన నాయకులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇది గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గాల్లోనూ పార్టీని ఘోరంగా ఓడించింది. అయితే.. ఇప్పుడు అధికారం కోల్పోయింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ అధినేత నిర్ణయించుకున్నారు.
కానీ, సిక్కోలు వంటి జిల్లాల్లో ధర్మాన వంటి నాయకులను కొనసాగిస్తే.. తాము కొనసాగేది లేదని క్షేత్రస్థా యి నాయకులు చెబుతున్నారు. దీనికి కారణం.. ధర్మాన అనుసరించిన విధానాలేనని చెబుతున్నారు. జిల్లాలో అతి పెద్ద సామాజిక వర్గం కాళింగులకు అవకాశం ఇస్తే.. బలమైన ఎదుగుదల ఉంటుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ధర్మాన కు అవకాశం ఇవ్వడం.. ఆయన చెప్పినట్టే ఇంకా వినమని చెప్పడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
అంతేకాదు.. క్యాడర్ ఎవరితో సమన్వయం చేసుకోవాలో కూడా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ధర్మాన వైపే అందరూ ఉండే పరిస్థితి ఏర్పడిందని.. ఇది తమకు సుతరాము ఇష్టం లేదని నాయకులు తేల్చి చెబుతున్నారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన సీతయ్యకు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పజెబితే బాగుంటుందని అంటున్నారు. కానీ, సీతయ్యకు ధర్మానకు పడని కారణంగా.. జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిందన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. కేవలం తన స్వార్థం కోసం పనిచేసే ఇలాంటి వారిని పక్కన పెట్టాలని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. మరి జగన్ ఏమేరకు స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 5, 2024 9:56 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…