తిరుమల లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ హిందువులు ఆచరించే సనాతన ధర్మం గురించి చాలా బలంగా గళాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేవారిపై ఆయన విరుచుకుపడుతున్నారు. గట్టిగా హెచ్చరికలూ జారీ చేస్తున్నారు.
తాజాగా తిరుపతి సభలో ఆయన పరోక్షంగా డీఎంకే నేత, ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా విమర్శలు గుప్పించారు. కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్‌తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను పవన్ ఉటంకించారు.
ఈ వ్యాఖ్యలపై డీఎంకే నుంచి స్పందన వచ్చింది. తాజాగా మీడియా వాళ్లు ఉదయనిధిని స్పందించమని కోరగా.. ఆయన. వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం దాటవేశారు. కాగా డీఎంకే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుసగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే ఆ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విషయం మరిచిపోరాదంటూ బీజేపీపై కౌంటర్ వేశారు ఇళంగోవన్.
తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ అన్నారు.
ఇటీవల చెన్నైకి వెళ్లి ఓఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ తమిళనాడు గురించి, అక్కడి రాజకీయాల గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తూనే సనాతన ధర్మాన్ని కాపాడాలని అక్కడి నేతలకు పిలుపునిచ్చారు.
This post was last modified on October 5, 2024 4:36 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…