రాష్ట్రంలో రెడ్ బుక్కుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌కు మాత్రమే పరిమితమైంది. ఆయన తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అనే పదాన్ని ప్రయోగించడంతోపాటు.. పుస్తకాన్ని కూడా పరిచయం చేశారు.
అదే ఇప్పటికీ.. ఎక్కడ ఏకేసు పెట్టినా వినిపిస్తోంది. ఇక, టీడీపీలోనే మరో నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా తన దగ్గర కూడా రెడ్ బుక్కు ఉందని.. దానిలోనూ వందకు పైగా పేర్లు ఉన్నాయని కొన్నాళ్ల కిందట ఆరోపించారు.
అయితే.. భూమా రెడ్ బుక్ వ్యవహారం చప్పబడింది. దానిపై ఎవరూ కామెంట్లు చేయలేదు. అయితే.. నారా లోకేష్ రెడ్ బుక్ మాత్రం తరచుగా లైవ్‌లోనే ఉంది. ఆయన కూడా ఎక్కడ సందర్భం వచ్చినా.. ఔను నా దగ్గర రెడ్‌బుక్ ఉంద
నే చెబుతున్నారు. దానిలో ఐపీఎస్‌లు, ఐఏఎస్‌ల పేర్లు కూడా ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఈ బుక్ వివాదం ఇలా ఉంటే, ఇప్పుడు వైసీపీ కూడా రెడ్ బుక్కులు తెరవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.
వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ రెడ్ బుక్‌లు మెయింటెన్ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ బుక్‌లోని ప్రతి ఒక్కరికీ బుద్ధి చెప్పేలా(అంటే శిక్షించేలా) జగన్ చర్యలు తీసుకుంటా రని కూడా చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ కూడా ఇక రెడ్ బుక్కులు ప్రారంభించనుందన్న చర్చ మొదలైంది. అయితే.. సజ్జల వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? అనేది చర్చ.
ఎందుకంటే.. కూటమి సర్కారు వచ్చి మూడు మాసాలు మాత్రమే అయింది. ఇంతలోనే వైసీపీ రెడ్ బు క్కుల మాట మాట్లాడితే.. ప్రజలు హర్షించే అవకాశం లేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న మీరు.. ఇప్పుడు ఇలా వ్యవహరిస్తారా? అనే చర్చ కూడా తెరమీదికి వస్తుంది. కానీ, ఇప్పుడు సజ్జల వ్యాఖ్యల అంతరార్థం.. తమ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో జోష్ నింపేందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఇంకా సమయం ఉందని.. అప్పటికి ఈ విషయం తెరమరుగైనా కావొచ్చని అంటున్నారు. కానీ, తీవ్ర నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్‌ను ఏదో ఒక విధంగా గాడిలో పెట్టేందుకు సజ్జల ఇలా రెడ్ బుక్
ప్లాన్ చేసి ఉంటారని.. తద్వారా కేడర్ పుంజుకుంటుం దని ఆయన ఆశించి ఉంటారని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on October 5, 2024 11:19 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…