ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లపై సైబరాబాద్ పోలీసు స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి కేసులు నమోదయ్యాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందనరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం. అంతేకాదు.. దర్యాప్తును ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. గురువారం రాత్రి రఘునందనరావు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
గత నాలుగు రోజులుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ రఘునందనరావుతో కలిసిఆమె పాల్గొన్న కార్యక్రమంలో సురేఖను రఘునందనరావు నూలుతో తయారు చేసిన మాల వేసి సత్కరించారు. ఈ ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమంలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేశారు. దీనిపై మొదలైన రగడ.. పెను దుమారంగా మారి.. పెద్ద పొలిటికల్ సునామీగా అవతరించింది.
అయితే.. అసలు ఈ ఫొటోలను మార్ఫింగ్ చేయించింది.. ప్రచారం చేయిస్తున్నది కూడా.. కేటీఆర్, హరీష్ రావులేనని పేర్కొంటూ ఎంపీ రఘునందనరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఈ వార్తలకు సొంత వ్యాఖ్యానాలు జోడించి ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లపైనా రఘునందన రావు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రులు ఇద్దరిపైనా, యూట్యూబ్ చానెళ్ల బాధ్యులపైనా సైబరాబా ద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నేడు ధర్నాలకు పిలుపు
గురువారం అర్ధరాత్రి నమోదైన కేసులపై బీఆర్ ఎస్ నాయకత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా హరీష్‌రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సహా వరంగల్ జిల్లాలోనూ ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
This post was last modified on October 4, 2024 10:31 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…