టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సురేఖ ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రత్యర్థులను విమర్శించడం కోసం.. సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని సూచించారు. సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సురేఖపై అక్కినేని అమల ఘాటుగా స్పందించారు. ఒక మంత్రి దెయ్యం పట్టినట్లుగా రాక్షసంగా మాట్లాడారని, తన భర్త, కుటుంబంపై సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తమను వాడుకునేందుకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. సురేఖ తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పి.. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని అమల కోరారు.
కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సురేఖ వంటివారు తప్పనిసరిగా వ్యక్తుల గౌరవాన్ని, గోప్యతను గౌరవించాలని తారక్ హితవు పలికారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా విసురుతున్న నిరాధారమైన ప్రకటనలు చూసి నిరుత్సాహంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులు ఇండస్ట్రీకి చెందిన వారిపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోబోమని తారక్ హెచ్చరించారు.
కొండా సురేఖ కామెంట్లపై హీరో నాని మండిపడ్డారు. ఎంతో గౌరవప్రదమైన హోదా ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరి కాదని నాని అన్నారు. రాజకీయ నేతలు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుందని మండిపడ్డారు.
సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు. తోటి మహిళపై ఆ కామెంట్స్ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై తమిళ నటి ఖుష్బూ సుందర్ కూడా ఖండించారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా అని నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు.
ఇక, సురేఖ వ్యాఖ్యలను రచయిత, నిర్మాత కోన వెంకట్ ఖండించారు. నాగార్జున కుటుంబంపై ఆమె వ్యాఖ్యలు బాధాకరమని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
This post was last modified on %s = human-readable time difference 10:11 am
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…