మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలోనే మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య, సీనియర్ హీరో నాగార్జునల పేర్లను ప్రస్తావిస్తూ వారి వ్యక్తిగత జీవితానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా సురేఖ చేసిన కామెంట్లు ఇటు ఏపీ, తెలంగాణ రాజకీయాలతోపాటు టాలీవుడ్ నూ కుదిపేశాయి. దీంతో, సురేఖ వ్యాఖ్యలపై సమంత, నాగార్జున, నాగ చైతన్య, అమల, అఖిల్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో నాని, నటుడు ప్రకాష్ రాజ్, మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యలపై స్పందించారు. సమంతను ఉద్దేశిస్తూ సురేఖ తాజాగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే తన ఉద్దేశ్యమని సురేఖ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. సమంత మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని సమంతనుద్దేశించి సురేఖ ట్వీట్ చేశారు. స్వయంశక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శప్రాయమని సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంతగానీ, సమంత అభిమానులుగానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని సురేఖ పోస్ట్ చేశారు.
సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సురేఖపై బీఆర్ఎస్ శ్రేణులతోపాటు, సమంత, నాగ చైతన్య, నాగార్జున, అఖిల్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా సమంత గురించి అటువంటి ఆరోపణలు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 3, 2024 10:05 am
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…