Political News

దేశంలో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్

హైదరాబాద్ మహానగరాన్ని మరింత సౌకర్యవంతంగా తయారు చేసేందుకు వీలుగా రేవంత్ రెడ్డి సర్కారు భారీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికి ఉన్న మెట్రో కు అదనంగా మెట్రో ఫేజ్ 2లో భాగంగా 116.2 కిలోమీటర్ల ప్రయాణానికి వీలుగా ఆరు కారిడార్లలో సమగ్ర ప్రాజెక్టు నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రూ.36 వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఈ మెట్రోతో హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫేజ్ 2కు ప్రభుత్వం ఓకే చెప్పేశారు.

మరి.. ఈ ఆరు కారిడార్లకు సంబంధించి ఏయే ప్రాంతాలకు ఏయే కారిడార్.. ఇందులో ఉండే మెట్రో స్టేషన్లు ఏవేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. లోతైన చర్చల అనంతరం రెండో దశ మార్గాల్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆమోదించినట్లుగా పేర్కొన్న హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీకి రావిర్యాల మీదుగా మెట్రో అనుసంధానానికి ఆకర్షణీయమైన సౌకర్యాలతో వినూత్న రీతిలో డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.8వేల కోట్లు వ్యయమవుతుందని పేర్కొన్నారు. ఆరో కారిడార్ మినహా మిగిలిన ఐదు కారిడార్ల డీపీఆర్ లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్రానికి సమర్పించనున్నారు. ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరే తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది.

ప్రస్తుతం ఉన్న 69 కి.మీ. మెట్రో రైలుకు రానున్న రోజుల్లో 116.6 కి.మీ అదనం కానుంది. ఇంతకూ ఏ కారిడార్లో ఏయే స్టేషన్లు రానున్నాయి? అన్నది చూస్తే..
కారిడార్ (4) ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్

రూట్: నాగోల్ – చాంద్రాయణ గుట్ట – ఆరాంఘర్ – శంషాబాద్
మొత్తం స్టేషన్లు: 24
దూరం: 36.6కి.మీ. (35కి.మీ. ఆకాశమార్గాన.. 1.6కి.మీ. భూగర్భంలో)
స్టేషన్లు
నాగోల్
నాగోల్ ఎక్స్ రోడ్
అల్కాపురి కూడలి
కామినేని ఆసుపత్రి
ఎల్బీనగర్ (ఎయిర్ పోర్టు)
బైరామల్ గూడ
మైత్రి నగర్
కర్మన్ ఘాట్
చంపాపేట రోడ్
ఒవైసీ ఆసుపతప్రి
డీఆర్ డీవో
బాలాపూర్ రోడ్
చంద్రాయణగుట్ట (జంక్షన్)
బండ్లగూడ రోడ్
మైలార్ దేవ్ పల్లి
కాటేదాన్
ఆరాంఘర్
న్యూహైకోర్టు
గగన్ పహాడ్
సాతంరాయి
సిద్ధాంతి
శంషాబాద్
కార్గో
ఎయిర్ పోర్టు
కారిడార్ 5 (రాయదుర్గం – విప్రో సర్కిల్ – కోకాపేట)
దూరం: 11.6కి.మీ.
స్టేషన్లు: 10
స్టేషన్లు
బయోడైవర్సిటీ జంక్షన్
ఖాజాగూడ
నానక్ రాంగూడ
గోల్ఫో కోర్స్
విప్రో సర్కిల్
పుప్పాల గూడ
ఓఆర్ఆర్ జంక్షన్
ఖానాపూర్
మూవీ టవర్స్
కోకాపేట నియోపొలిస్
కారిడార్ 6
ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట
దూరం: 7.5కి.మీ
స్టేషన్లు: 6
స్టేషన్లు ఇవే..
సాలార్ జంగ్ మ్యూజియం
చార్మినార్
శాలిబండ
అలియాబాద్
ఫలక్ నుమా
చాంద్రాయణగుట్ట (జంక్షన్)
కారిడార్ 7
(మియాపూర్ – పటాన్ చెర్వు
దూరం: 13.4కిమీ
స్టేషన్లు: 10
స్టేషన్లు ఇవే
మియాపూర్ క్రాస్ రోడ్
అల్విన్ చౌరస్తా
మదీనాగూడ
చందానగర్
బీహెచ్ఈఎల్
జ్యోతినగర్
బీరంగూడ
ఆర్ సీ పురం
ఇక్రిశాట్
పటాన్ చెర్వు
కారిడార్ 8
(ఎల్బీనగర్ – హయత్ నగర్)
దూరం: 7.1కిమీ
స్టేషన్లు: 6
స్టేషన్లు ఇవే
చింతల్ కుంట
వనస్థలి పురం
ఆటోనగర్
లెక్చరర్స్ కాలనీ
ఆర్టీసీ కాలనీ
హయత్ నగర్
కారిడార్ 9
(శంషాబాద్ ఎయిర్ పోర్టు – ఫ్యూచర్ సిటీ స్కిల్ వర్సిటీ వరకు)
దూరం: 40కి.మీ.
స్టేషన్లు: ఇంకా కసరత్తు పూర్తి కాలేదు.

This post was last modified on October 1, 2024 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌వ‌న్ – స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ఎక్కింది..!

అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్‌! అంటుంది 'స‌నాత‌న ధ‌ర్మం'. అతిగా ఏ విష‌యంపైనా స్పందించ‌కూడ‌ద‌నేది ఈ ధ‌ర్మం చెబుతున్న మాట‌. అంతేకాదు..…

40 mins ago

అమ్మ చెప్పిన ‘కళ్యాణ్ కబుర్లు’

ఏదైనా సినిమా రిలీజ్ టైంలోనో ఇంకో సందర్భంలోనో మీడియా ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల గురించి పొడి పొడిగా రెండు మూడు మాటలు…

42 mins ago

జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడు: లోకేష్

కొత్త సీసాలో పాత సారా! అనే సామెత‌ను వైసీపీ, టీడీపీలు మ‌రోసారి నిరూపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితా లు వ‌చ్చిన జూన్…

44 mins ago

కళ్యాణ్ రామ్ పంట పండుతోంది

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఒకప్పుడు ఎలాంటి సాహసాలు చేశాడో తెలిసిందే. తన కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో ‘అతనొక్కడే’…

2 hours ago

ఎవరు పెద్ద హీరో.. సురేష్ బాబు కామెంట్స్

టాలీవుడ్లో నంబర్ల గేమ్ గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అభిమానులు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా…

3 hours ago

తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సెంచరీ

మొత్తానికి ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దాని కంటే మెరుగైన ఫలితం దిశగా దూసుకెళ్తోంది. కొంచెం మిక్స్డ్ రివ్యూలు,…

4 hours ago