చెరువులు, కుంటలు, సరస్సులను ఆక్రమించి లేదా.. వాటిని పూర్తిస్థాయిలో పారనివ్వకుండా భూమిని ఆక్రమించి చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శనివారం, ఆదివారం లక్షిత ప్రాంతాల్లో హైడ్రా దూకుడు ప్రదర్శి స్తోంది.
అయితే.. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ శనివారం, ఆదివారం కొంత దూకుడు తగ్గించింది. అంతేకా దు.. చాలా రోజుల తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి భవనాన్నీ కూల్చి వేస్తామని చెప్పారు.
తమ టార్గెట్ పెద్దలేనని చెప్పిన రంగనాథ్.. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవన్నీ రాజకీయ పరమైనవని, వాటితో తమకు సంబంధం లేదని చెప్పారు.
అయితే.. ఒవైసీ మెడికల్ కాలేజీ సహా.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డిల కాలేజీలను కూడా కూల్చి వేస్తామని చెప్పా రు. ఇప్పటికే వీటికి నోటీసులు పంపించామని, ప్రస్తుతం విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కూల్చి వేస్తే.. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అందుకే కొంత సమయం వేచి చూస్తున్నట్టు రంగనాథ్ తెలిపారు.
పేదల ఇళ్లను కూల్చివేయాలన్నది తమ లక్ష్యం కాదని రంగనాథ్ చెప్పారు. అయితే.. విల్లాలను నిర్మించింది మాత్రం పెద్దలేనని.. అందుకే వాటిని కూల్చేస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని.. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటా మని చెప్పారు.
ఇక, కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జువ్వాడ ఫామ్ హౌస్‌పైనా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జువ్వాడ తమ పరిధిలో లేదన్నారు. అంతేకాదు.. ఆ ప్రాంతం జీవో 111 పరిధిలో ఉందని తెలిపారు. ఇది హైడ్రా పరిధిలో లేదని కాబట్టి.. తమకు సంబంధం లేదని చెప్పారు. చట్ట ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు నిర్దేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన వివరించారు.
This post was last modified on September 29, 2024 3:20 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…