Political News

విశాఖ ఉక్కుకు అభ‌యం.. బాబు ప్ర‌తిపాద‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్‌!

విశాఖప‌ట్నంలో కొన్ని ద‌శాబ్దాల కింద‌ట ఏర్ప‌డిన ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క్రియ దాదాపు నిలిచిపోయిన‌ట్టు తెలుస్తోంది. వైసీపీ హ‌యాంలో మొగ్గ తొడిగిన ఈ ప్ర‌తిపాద‌నను అడ్డుకునేందుకు అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఏదో మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో విశాఖ ఉక్కు వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం దిశ‌గా అడుగులు వేసింది. మ‌రోవైపు 1350 రోజులుగా ఇక్క‌డి కార్మికులు ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేస్తూ.. ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటు ప‌రం చేయొద్ద‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప‌రిణామాలు సాగుతున్న క్ర‌మంలో హైకోర్టులో ప‌లు పిటిష‌న్లు కూడా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం అవి విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను య‌థాత‌థ స్థితిలో కొన‌సాగిస్తున్నారు. ఇక‌, రాష్ట్రం లో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన ద‌రిమిలా.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక అంశంగా దీనిని తీసుకుని కేంద్రంతో రెండు సార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామికి ప్ర‌త్యేకంగా రిప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటు ప‌రం చేయ‌రాద‌ని.. దీనిని తాము కాపాడుకుంటామ‌ని కూడా చంద్ర‌బాబు రెండు నెల‌ల కింద‌ట చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ భాగస్వామ్య పార్టీగా ఉండ‌డంతో చంద్ర‌బాబు సూచ‌న‌లు, ఆయ‌న ఇచ్చిన విన‌తులు ప‌నిచేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటు ప‌రం చేయ‌కుండా.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(సెయిల్)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి గ‌త రెండు రోజులుగా చ‌ర్చ సాగుతున్నాయి.

ఈ విష‌యాన్ని ఏపీకి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వ‌ర్మ కూడా నిర్ధారించారు. 2030 నాటికి కేంద్ర ప్ర‌భుత్వం పెట్టుకున్న ల‌క్ష్యం(300 మిలియ‌న్ ట‌న్నుల ఉక్కు ఉత్ప‌త్తి) సాధించేందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని అభివృద్ది చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ఫ్యాక్ట‌రీని ప్రైవేటు ప‌రం చేయ‌కుండా సెయిల్‌లో విలీనం చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. మొత్తానికి ఈ ప‌రిణామం.. కార్మికుల‌కు ఊర‌టనిస్తోంది.

This post was last modified on September 28, 2024 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

3 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

11 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

15 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

15 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

15 hours ago