Political News

జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న స్టార్ట్‌.. అంతా ఉత్కంఠే..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. రేపు(శ‌నివారం) ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదంతా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిందన్న ప్రభుత్వ ప్రచారం, కొన్ని రిపోర్టులు, అధికారుల వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న పర్యటన కావడం గ‌మ‌నార్హం. పైగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్లడం ఉత్కంఠ‌గా మారింది.

తిరుమల అపవిత్రం అయిందన్న వార్తల నేపథ్యంలో హిందూ సంఘాలు, బిజెపి నేతల నుంచి తీవ్రస్థాయిలో వైసిపి పై విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, నిరసనలతో కూడా తిరుమల తిరుపతి అట్టుడుగుతున్న పరిస్థితి తెలిసిందే. బిజెపి నాయకులు కొందరు జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడికి కూడా దిగారు. ఇంకోవైపు రాష్ట్రంతో సంబంధం లేకపోయినా బిజెపి నాయకులు కొందరు తిరుమల లడ్డు అపవిత్రం కావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ తమ నిరసనలను తెలుపుతున్నారు.

ఈ పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి తిరుమ‌ల పర్యటన కీలకంగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా జగన్ పర్యటనను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే పోలీసులు తిరుపతిలో పోలీసు యాక్ట్ 30ని తీసుకొచ్చారు. నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని కూడా అంతర్గత సమాచారం ద్వారా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వాస్తవానికి తిరుమలకు పాదయాత్ర ద్వారా వెళ్లాలనుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకొని నేరుగా వాహనంలోనే తిరుమలకు చేరుకోనున్నారు.

మరి ఆయ‌న‌ పాదయాత్ర నుంచి ఎందుకు విరమించుకున్నారు? వెనక్కి త‌గ్గారా? లేక ఉదేశపూర్వకంగానే ముందు అలా ప్రకటించి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదని గ్రహించిన తర్వాత ఆయన నడక ద్వారా తిరుమలకు వెళ్లడం అనే అంశాన్ని వాయిదా వేసుకున్నారా? అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏదేమైనా జగన్ తిరుమల పర్యటన అయితే ఈరోజు మొదలవుతుంది. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకోవైపు వైసీపీ నాయకులు ఎక్కడిక‌క్కడ నిరసనలు వ్యక్తం చేయాలని అనుకున్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

This post was last modified on September 27, 2024 9:53 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

51 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago