రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. ఇప్పుడు వైసీపీ విలవిల్లాడుతోంది.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో వందకు పైగా తప్పులు చూపిస్తూ.. దాడి చేస్తున్న తీరు ఓ రేంజ్‌లో సాగుతోంది. శ్వేత పత్రాల విడుదల ద్వారా.. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కళ్లకు కట్టింది. అప్పులు చేసి.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. ఇక, ఆ తర్వాత..ఏలూరులో ఎర్రవాగు పొంగింది.. దీనినికూడా వైసీపీ నిర్వాకంగా చూపడంలో కూటమి సర్కారు సక్సెస్ అయింది.
మరీ ముఖ్యంగా ఆర్థికంగా చేసిన అప్పులు.. అధికార దుర్వినియోగం.. మద్యం విధానంపై కూటమి సర్కా రు చేసిన కార్నర్‌తో వైసీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ఇంతలోనే వరదలువచ్చాయి. ఈ వరదల విషయంలో నూ వైసీపీ నిండా మునిగిపోయింది. వాస్తవానికి వరదల్లో నీటమునిగిన వారు అయినా.. తేరుకున్నారు కానీ .. వైసీపీ మాత్రం ఇప్పటికీ తేరుకోలేక పోయింది. వరదలకు కారణంగా..వైసీపీ చేసిన నిర్వాకమేనని కూటమి సర్కారు చేసిన ప్రచారం.. కాంగ్రెస్ నేత షర్మిల చేసిన ఆరోపణలు ప్రజల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇక, ఆ తర్వాత.. తెరమీదికి వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తారస్థాయికి చేరిపోయింది. దీని నుంచి బయట పడడం వైసీపీకి అంత తేలికకాదు. మరోవైపు వరుస వివాదాలు తెరమీదికి వస్తుండడం.. కీలక నాయకుల అరెస్టుతో.. అనేక మంది ఇతర ప్రధాన నాయకులు జెండా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఇప్పుడు వైసీపీ జెండా మోసే వారే కనిపించకుండా పోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ముప్పేట దాడిలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on September 23, 2024 9:46 am
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…