ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్‌బ్రాండ్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు విష్ణుకుమార్ రాజు వంటి వారు. అదేవిధంగా మేధావులు కూడా ఉన్నారు.
ఉదాహరణకు కామినేని శ్రీనివాస్ వంటివారు. అయితే.. తాజాగా బుధవారంతో కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆ జోష్ ఎక్కడా కనిపించ డం లేదు. ఒకవైపు సర్కారు 100 రోజుల పండుగను చేసుకోవాలని భావించింది.
కానీ, వర్షాలు, వరదల కారణంగా ఈ పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కానీ, రాజకీయంగా వేసిన అడుగులు, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపై మాత్రం కూటమి పెద్దలు చర్చిస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. అసెంబ్లీలో ఒకరిద్దరు మాట్లాడింది మినహా.. ప్రజల మధ్య కనిపించిన బీజేపీ ఎమ్మెల్యేలు లేరనే చెప్పారు. ఒక్క మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
అయితే.. వరద తగ్గిన తర్వాతే సత్యకుమార్ పర్యటించడంతో ఆయన ఆశించిన మేలు కానీ, పేరు కానీ రాలేదు. ఇక, ఎప్పుడూ సమకాలీన రాజకీయాలపై మాట్లాడే విష్ణుకుమార్ రాజు కూడా.. తనకు ప్రాధాన్యం దక్కలేదన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నారు.
కామినేని శ్రీనివాసరావు తన వ్యాపారాల్లో మునిగిపోయారు. ఇక, ఇతర నాయకులు కూడా ఎవరికివారు తమ పనుల్లో ఉన్నారే తప్ప.. ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్ల పాల్గొన్నవారు కూడా లేరు.
ఇలా బీజేపీ నాయకులు ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతి అంటూ ఏమీ ప్రత్యేకంగా లేదు. సత్యకుమార్ మంత్రి కాబట్టిపలుమార్లు ఆసుపత్రుల్లో పర్యటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అయితే.. ఈయన మాత్రం వైసీపీపై నిశిత విమర్శలు చేస్తూ.. ముఖ్యమంత్రిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మిగిలిన వారు మాత్రం ముసుగుతన్నినట్టు వ్యవహరిస్తున్నారు. మరి వీరి పరిస్థితి ఏంటనేది పార్టీనే ఆలోచించుకోవాలి. ఏదేమైనా.. వంద రోజుల బీజేపీ గ్రాఫ్ పెద్దగా లేచినట్టు కనిపించడం లేదు.
This post was last modified on September 20, 2024 3:50 pm
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…