తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా మంటపుట్టించాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి సహా.. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు క్షణాల్లోనే స్పందించారు. నిజానికి వైసీపీపై చేస్తున్న విమర్శలకు ఇటీవల కాలంలో ఇంత వేగంగా ఎవరూ స్పందించలేదు. కానీ, తాజాగా మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మాజీ సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇద్దరూ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టులు చేశారు.
బాబు విషయాన్ని పరిశీలిస్తే..కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఆయన.. తిరుమల శ్రీవారి ప్రసాదం, అక్కడ జరుగుతున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనను ఉదహరిస్తూ.. తిరుమలను ధ్వంసం చేశారని..చెప్పారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో నాణ్యమైన ఆవునెయ్యిని వినియోగించాల్సి ఉండగా.. జంతువుల కొవ్వును వాడి.. నాశనం చేశారని చెప్పారు. అదేవిధంగా అన్న ప్రసాదాలలోనూ నాణ్యతను తగ్గించి.. భక్తుల మనోభావాలను, తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంటనే స్పందించారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. “దివ్వ క్షేత్రం తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు నాయుడు పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అంత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు” అని రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇదేసమయంలో వైవీ సుబ్బారెడ్డి కూడా ఎక్స్‌లో స్పందించారు. “రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోసారి నిరూపితమైంది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో సిద్ధమా!” అని సవాల్ రువ్వారు. మరి దీనిపై టీడీపీ నాయకులు, మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on September 19, 2024 10:42 am
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…