Political News

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. ఈ నూత‌న మ‌ద్యం విధానంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

దీని ప్ర‌కారం.. ఇక నుంచి మ‌ద్యం దుకాణాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానం మేర‌కు ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 10 వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది.

కానీ, ఇప్పుడు మ‌రో గంట స‌మ‌యాన్ని పొడిగించారు. ఇది రాత్రివేళ‌(నైట్) ప‌నులు చేసుకుని ఉద‌యం ఇంటికి చేరుకునే కార్మికుల కోసం తీసుకువ‌చ్చిన వెసులుబాటుగా స‌ర్కారు పేర్కొంది.

ఇక‌, అన్నీ నాణ్య‌మైన బ్రాండ్ల‌నే అందుబాటులో ఉంచ‌నున్నారు. దీని ప్ర‌కారం సాధార‌ణ మ‌ద్యం ప్రారంభ‌ ధ‌ర రూ.99 నుంచి మొద‌ల‌వుతుంది. అయితే.. నాణ్య‌మైన బ్రాండ్ల ధ‌ర‌లు కంపెనీలు.. ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్ణ‌యిస్తాయి. రాష్ట్రంలో క‌ల్లుగీత కార్మికుల‌కు 10 శాతం మ‌ద్యం షాపుల‌ను రిజ‌ర్వ్ చేశారు.

ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే వాటిని కేటాయించ‌నున్నారు. ఈ డిమాండ్ కూడా ఎప్ప‌టి నుంచో ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంత్రి తెలిపారు. ఇక‌, దీనివ‌ల్ల క‌ల్లుగీత కార్మికుల‌కు ఆర్థికంగా వెసులుబాటు ల‌భిస్తుంద‌న్నారు.

వైసీపీ హ‌యాంలో కొన్ని ర‌కాల మ‌ద్య‌మే అందుబాటులో ఉండ‌గా.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనుంది. ఈ మేర‌కు మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. మద్యం దుకాణాలకు  లాటరీ పద్ధతిలో లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవి రెండేళ్ల‌పాటు ఉంటాయి.

దీనికిగాను తిరిగి చెల్లించ‌ని విధానంలో స‌ర్కారు వారు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ద‌ర‌ఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాల‌ను కేటాయించ‌నున్నారు. వ్యాపారంలో యజమానికి 20 శాతం లాభం వ‌చ్చేలా మ‌ద్యం పాల‌సీని నిర్ణ‌యించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల మంది జ‌నాభాకు ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం భావిస్తోంది. అలాగే ఏపీలో 12 ప్రీమియర్ లిక్కర్ షాపులను ఏర్పాటు చేయ‌నున్నారు.  

This post was last modified on September 18, 2024 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైలులో 100 రోజుల సినిమా

మాములుగా సినిమాలు శతదినోత్సవాలు చేసుకుంటే అభిమానులకు అదో పండగ. ఎన్ని ఎక్కువ సెంటర్లలో ఆడితే అంత గర్వంగా చెప్పుకుంటారు. కానీ…

37 mins ago

ఇక‌.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కూట‌మి నేత‌లు!

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచి 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం'…

3 hours ago

జానీ మాస్ట‌ర్ అరెస్టు

ప్ర‌ముఖ కొరియో గ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌ను సైబ‌రాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గ‌త రెండు రోజులుగా జానీ…

3 hours ago

అనుమానాలు వద్దంటున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర జనవరి 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకుంది. షూటింగ్…

3 hours ago

శర్వా ముందుకు… గాంజా పక్కకు

అప్పుడెప్పుడో నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నందితో సితార సంస్థ గాంజా శంకర్ ని…

4 hours ago

కొత్త సినిమాలు వెలవెలా – రీ రిలీజులు కళకళా

రేపు కొత్త శుక్రవారం అనే ఆనందం బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. కౌంట్ పరంగా సినిమాలైతే ఉన్నాయి కానీ దేనికీ…

4 hours ago