Political News

జ‌మిలికి జై! కేంద్ర కేబినెట్ ఓకే!!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప‌దే ప‌దే చెబుతున్న జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాజాగా మ‌రింత ముంద‌డుగు ప‌డింది. జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాజాగా జ‌రిగిన మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వ‌ర్గం జై కొట్టింది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌కు ఓకే చెప్పింది.

జ‌మిలి ఎన్నిక‌ల‌ను ముక్త‌కంఠంతో కేంద్ర కేబినెట్ స్వాగ‌తించింది. “వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్‌” నినాదాన్ని అందిపుచ్చుకుంది. ప్ర‌ధాని గ‌త ఆగ‌స్టు 15న ఎర్ర‌కోట‌పై చేసిన ప్ర‌సంగంలో జ‌మిలి ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. త‌మ టెర్మ్‌(ఈ పాల‌న‌లో)లోనే జ‌మిలిని నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

అప్ప‌టికే జ‌మిలి ఎన్నిక‌ల‌పై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవ‌డం, జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించ‌డం ల‌క్ష్యంగా మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ కొన్ని సిఫార‌సులు చేస్తూ.. నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పంపించింది.

మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమొదం తెలిపింది. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత…రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను అందించిన విష‌యం తెలిసింది. ఈ నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌.. కేంద్ర హోం శాఖ‌కు ఇటీవ‌ల పంపించింది.

దీనిపై తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మోడీ స‌హా మంత్రులు ఆమోదం తెలిపారు. అయితే.. ఈ సిఫార‌సుల్లో జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణ ఆవశ్యం ఉంద‌ని పేర్కొన్నారు. ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి.

జ‌మిలి ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు రెండంచల విధానం అమ‌లు చేయాల‌ని సిఫారసు చేశారు. మొదట లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు. మొదటి దశ పూర్త‌యిన వంద రోజుల్లోపు… రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ‌హించాల్సి ఉంటుంది.

ఏదైనా కారణంతో పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని మాజీ రాష్ట్ర‌ప‌తి కోవింద్ నేతృత్వంలోని క‌మిటీ సిఫారసు చేసింది. అదేవిధంగా అభ్య‌ర్థులు మ‌ర‌ణించినా.. ఇత‌ర కార‌ణాల‌తో ఎన్నిక‌లు ఆగిపోయినా.. మిగిలిన కాలానికే ఆయా స్థానాలకు(అవి ఏవైనా కూడా) ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది. కాగా.. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలోనూ తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. అయితే.. కీల‌క‌మైన కేంద్ర కేబినెట్ మాత్రం తాజాగా అంగీకారం తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 18, 2024 7:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

26 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago