ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషిని ఆప్ నాయక త్వం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఢిల్లీలో ఈ రోజు(మంగళవారం) ఉదయం జరిగిన పార్టీ లెజిస్లేచర్ సమావే శంలో అతిషి పేరును నాయకులు సూచించారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆమెను అందరూ ముక్తకం ఠంతో స్వాగతించారు. దీంతో అతిషి పేరును ఖరారు చేస్తూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆరు మాసాలపాటు జైల్లో ఉన్నారు. గత శనివారమే ఆయన బైయిల్పై బయట కు వచ్చారు. అయితే.. ఆయన ఇన్నాళ్లు జైల్లో ఉన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పైగా జైలు నుంచే పాలిస్తానంటూ ప్రకటించారు. కానీ, అనూహ్యంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
కాగా..సీఎం కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన వారసురాలిగా మంత్రి అతిషిని ఎంపిక చేశారు. ఆమె బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. కేజ్రీవాల్ సహా పలువురు కీలక నాయకులు మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్నప్పుడు.. అతిషి ఢిల్లీ రాష్ట్రాన్ని ఒంటిచేత్తో నడిపించారు.
యమునా నది వరదలు వచ్చినప్పుడు.. భారీ వర్షాలతో ఢిల్లీ మునిగిపోయినప్పుడు కూడా ఆమె ప్రభు త్వం తరఫు న కీలకంగా పనిచేశారు. దీంతో కేజ్రీవాల్ తన వారసురాలిగా అతిషిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఉన్నత విద్యావంతురాలైన అతిషి.. ఆప్‌లో మొదటి నుంచి రాజకీయంగా యాక్టివ్ రోల్ పోషించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…