Political News

ప‌వ‌న్‌-పంచాయ‌తీ- వితౌట్ పాలిటిక్స్!!

ఏపీలోని గ్రామ పంచాయ‌తీల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గతానికి భిన్నంగా ఇంకో మాట‌లో చెప్పాలంటే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయ‌తీలు.. ల‌క్ష రూపాయ‌లు క‌ళ్ల చూస్తున్నాయి. వాస్త‌వానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న ప‌రిస్థితిలో పంచాయ‌తీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేర‌కు కోలుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ పాల‌న కాలంలో కేంద్రం నుంచి వ‌చ్చిన 600 కోట్ల రూపాయ‌ల‌ను దారి మ‌ళ్లించార‌నే అప‌వాదు ఉంది.

దీంతో అప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో స్వావ‌లంబ‌న సాధించిన పంచాయతీలు.. ఇబ్బందుల్లో కూరుకుపోవడం ప్రారంభ‌మైంది. ఫ‌లితంగా పంచాయ‌తీ స‌భ్యులు టీ తాగేందుకు కూడా సొంత జేబులో నుంచి రూపాయి తీయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ప‌నుల సంగ‌తి దేవుడెరుగు. మ‌రోవైపు.. స‌ర్పంచులు.. బిక్షాట‌న చేసుకున్న ప‌రిస్తితి నుంచి.. చిరు వ్యాపారాలు చేసుకుని.. ఓలా డ్రైవ‌ర్లుగా ప‌నిచేయాల్సిన ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. కొంద‌రు జొమాటోలో కూడా ప‌నిచేశారు.

ఇలా.. గ్రామ పంచాయ‌తీలు ఒక ప్ర‌మాద‌కర ప‌రిస్థితిని ఎదుర్కొన్నాయి. ఖ‌చ్చితంగా ఇంత కీల‌క స‌మయంలో పంచాయ‌తీలు పుంజుకునేలా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు న‌భూతో అనే చెప్పాలి. త‌న సొంత సొమ్ముల నుంచి రూ.4 కోట్ల‌ను పంచాయ‌తీల‌కు రూ.ల‌క్ష చొప్పున ఆయ‌న విరాళంగా అందించారు. ఇది ఒక‌ర‌కంగా.. వెంటిలేట‌ర్‌పై ఉన్న పంచాయ‌తీల‌కు ఆక్సిజ‌న్ అందించిన‌ట్టు అయింది. చ‌నిపోతున్న వ్య‌క్తికి ప్రాణం పోసిన‌ట్టుగా మారింది.

ల‌క్ష రూపాయ‌లు చిన్న మొత్త‌మే అయినా.. ఇవి ఇప్పుడున్న ఒక కీల‌క సంద‌ర్భంతో పోల్చుకుంటే.. పంచాయ‌తీల‌కు ప్రాణంతో స‌మానం. అందుకే.. పంచాయ‌తీల్లో పండ‌గ నెల‌కొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పంచాయ‌తీల్లో జేజేలు కొడుతున్నారు. చిన్న‌పాటి ప‌నులు చేసేందుకు.. స‌ర్పంచులు, స‌భ్యులు కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్‌-పంచాయ‌తీ- వితౌట్ పాలిటిక్స్ అనే మాట జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 12, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

4 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

12 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

15 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

16 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

16 hours ago