Political News

మాజీ ఎంపీ స‌హా వైసీపీ నేత‌ల అరెస్టు.. పార్టీలో క‌ల్లోలం!

ఏపీలో ఒక‌వైపు వ‌ర‌దలు మ‌రోవైపు.. వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే స‌మయంలో రాజ‌కీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసుపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు ఉరుకులు ప‌రుగులు పెడుతోంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వైసీపీ నాయ‌కుల‌ను గ‌త అర్థ‌రాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది.

వీరిలో బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గురువారం తెల్ల‌వారు జామున మంగ‌ళ‌గిరిలోని ఆయ‌న నివాసంలోనే సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉంద‌ని భావిస్తున్న విజ‌య‌వాడ న‌గ‌ర కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ అవుతు శైల‌జ భ‌ర్త‌.. ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ అవుతు శ్రీనివాస‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రితో పాటు యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌ను కూడా అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే.. ఆయ‌న పోలీసుల క‌ళ్లుగ‌ప్పి.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఎమ్మెల్సీలు.. త‌ల‌శిల ర‌ఘురాం, లేళ్ల అప్పిరెడ్డిల అరెస్టుకు కూడా రంగం రెడీ అయిన‌ట్టు స‌మాచారం. వారిద్ద‌రినీ అరెస్టు చేయాల్సి ఉంద‌ని.. అనుమ‌తి ఇవ్వాల‌ని.. మండ‌లి చైర్మ‌న్‌.. మోషేన్ రాజుకు పోలీసులు స‌మాచారం ఇచ్చారు. అయితే.. ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డంతో అరెస్టు వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. బుధ‌వారం వీరికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా త‌గిన గ‌డువు ఇవ్వ‌క‌పోవ‌డంతోపాటు.. కుట్ర‌కోణం ఉందంటూ.. న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. దీంతో రాత్రికి రాత్రి.. టీడీపీ ఆఫీసు కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రోజు రేప‌ట్లో మ‌రింత మందిని అరెస్టు చేసే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే, ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 12 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఇప్ప‌టికే అరెస్ట‌యి జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే.

This post was last modified on September 5, 2024 12:51 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

2 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago