Political News

చంద్ర‌బాబు జాగారం.. రాత్రంతా స‌మీక్ష‌లు.. కాన్ఫ‌రెన్సులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజ‌య‌వాడ ప‌రిస‌రప్రాంతాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోవ‌డం తో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితిని సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వ‌కుండా.. ప‌దే ప‌దే వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టరేట్‌లోనే సీఎం ఉన్నారు. అక్క‌డి నుంచే విజ‌య‌వాడ ప‌రిస్థితిని ఆయ‌న గంట గంట‌కూ స‌మీక్షించారు. బాధితుల‌కు ఆహారం , తాగునీరు అందించే బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్ప‌గించారు.

ఇదేస‌మ‌యంలో మంత్రులు ఎక్క‌డున్నా త‌క్ష‌ణ‌మే విజ‌య‌వాడ‌కు రావాల‌ని ఆదేశించారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌వారిని ఎంత రాత్ర‌యినా కూడా ఆదుకోవాల‌ని.. వారికి పులిహోర‌, పెరుగ‌న్నం త‌క్ష‌ణం అందించాల‌ని అన్ని ప్రైవేటు హోట‌ళ్ల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. అదేస‌మ‌యంలో 5 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్ల‌ను త‌క్ష‌ణం బాధిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. ఈ బాధ్య‌త‌ల‌ను కూడా పార్టీ నాయ‌కులు, మంత్రులు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా అల‌స‌త్వం చేస్తే.. స‌హించేది లేద‌న్నారు. రాత్రి పూట కూడా.. మ‌రో సారి సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలో వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌వారిని ప‌రామ‌ర్శించారు.

కేంద్రం నుంచి సాయం

చంద్ర‌బాబుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఫోన్ చేసి.. విజ‌య‌వాడ స‌హా.. రాష్ట్రంలో నెల‌కొన్న వ‌ర‌ద ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అండ‌గా ఉంటామ‌ని.. అన్ని విధాలా సాయం చేస్తామ‌ని చంద్ర‌బాబుకు ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఆవెంట‌నే 6 హెలికాప్ట‌ర్ల‌ను విజ‌య‌వాడ‌కు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పున‌రావాస కేంద్రాల్లోని వారికి ఆహారం అందించేందుకు మిల‌ట‌రీ సాయం కూడా అందిస్తామ‌ని తెలిపింది. బాధితుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండేందుకు తాము కూడా ప‌నిచేస్తామ‌న్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా.. పంపించారు. కాగా.. రాత్రి వేళ‌ల్లో కూడా చంద్ర‌బాబు నేతృత్వంలో స‌హాయం అందించేందుకు సిబ్బంది యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ముందుకు క‌దిలారు.

This post was last modified on September 2, 2024 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాలనపై పవన్ కు పట్టు వచ్చేసింది!

నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా…

42 minutes ago

కేసీఆర్ చేయ‌లేనిది చేసి చూపించిన రేవంత్

పెట్టుబ‌డుల వేట‌లో భాగంగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సొంత గ‌డ్డ నుంచి తీపి క‌బురు…

2 hours ago

రాబిన్ హుడ్ ఆగమనం….వీరమల్లు అనుమానం

మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…

4 hours ago

సైఫ్ పై దాడి.. కరీనా వాంగ్మూలంలో కీలక విషయాలు

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…

5 hours ago

2025 సంక్రాంతి.. ఆల్ హ్యాపీస్

తెలుగులో సంక్రాంతి పండ‌క్కి సినిమాల సంద‌డి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజ‌న్. ఈ…

8 hours ago

దబిడి దిబిడి భామ క్షమాపణ చెప్పింది

ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…

8 hours ago