Political News

వైసీపీకి ఎమ్మెల్యేలు సేఫే రీజ‌న్ ఇదే!

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు ఏక్ష‌ణంలో ఎలా మారుతాయో.. చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, ఒక ఎమ్మెల్సీ ఇప్ప‌టికే వైసీపీకి దూర‌మ‌య్యారు. వారి ప‌ద‌వుల‌కు, పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక ముందు కూడా మ‌రింత మంది పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు , వార్త‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా ఒక పార్టీ ప్ర‌భుత్వం పోయి.. మ‌రో పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఇలాంటి మార్పులు కామ‌న్‌గా మారాయి. దేశ‌వ్యాప్తంగా కూడా ఇదే జ‌రుగుతోంది.

దీనిని ప్ర‌లోభాల కోణంలోనే చూడాల్సిన అవ‌స‌రం లేదు. నాయ‌కుల‌కు అవ‌స‌రాలు కూడా అలానే ఉన్నాయి. వారి వ్యాపారాలు, ఆర్థిక స‌మ‌స్య‌లు.. వంటివి కూడా జంపింగుల‌కు కార‌ణాలుగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేశ‌వ్యాప్తంగా ప‌లు పార్టీల నాయ‌కులు పార్టీలు మారుతున్నారు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా అధికారం కూడా మారిపోతున్న ప‌రిస్థితులు మ‌న క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి ఏపీలో జ‌రిగిన‌.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఎవ‌రూ పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న‌వారి విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. రాజ్య‌స‌భ‌, శాస‌న మండ‌లి నాయ‌కులే ఉన్నారు. వీరు ప్ర‌స్తుతం ఆయా ప‌ద‌వుల్లో ఉన్నారు. అయితే.. వీరి అవ‌స‌రం కూట‌మి స‌ర్కారుకు ఉంది. మండ‌లిలో టీడీపీకి బ‌ల‌మైన ప‌క్షం లేదు. రాజ్య‌స‌భ‌లో అస‌లు స‌భ్యులే లేరు. దీంతో వారిని తీసుకునేందుకు కూట‌మి పార్టీలు ఒక ఫార్ములా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు జంప్ అవుతున్న వారి జాబితాలో వీరే క‌నిపిస్తున్నారు.

కానీ, శాస‌న స‌భ‌కు వ‌చ్చే స‌రికి కూట‌మికే లెక్క‌కు మించిన నాయ‌కులు ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేల తో కూట‌మి ప్ర‌భుత్వం కిక్కిరిసి పోయింది. సో.. ఇంత‌కు మించి వ‌చ్చినా.. అవ‌స‌రంలేదు. మ‌రీ ముఖ్యంగా టీడీపీకే 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబ‌ట్టి.. ఎమ్మెల్యేల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం.. అవ‌కాశం కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే.. ఎమ్మెల్యేల జోలికి పోకుండా.. కూట‌మి పార్టీలు.. రాజ్య‌స‌భ‌, మండ‌లి స‌భ్యుల‌ను మాత్రమే టార్గెట్‌ చేసిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సో.. ఈ ఫార్ములా ప్ర‌కారం చూసుకుంటే.. వైసీపీకి ఎమ్మెల్యేల విష‌యంలో ఇబ్బంది లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 30, 2024 10:29 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

1 hour ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

2 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

4 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

6 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

7 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

7 hours ago