తెలంగాణలో ‘భూ’ కంపం సృష్టిస్తున్న ‘హైడ్రా'(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్- అసెట్ ప్రొటెక్షన్, అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ఏపీలోనూ తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఏపీలోనూ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామని చెప్పారు.
అయితే.. ఈ ప్రకటన బాగానే ఉన్నా.. అనేక మంది రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలతో ముడి పడిన ఈ వ్యవహారంలో ముక్కు సూటిగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో జగన్ ఇదే తరహా ప్రయత్నం చేసి.. అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అక్రమాలు నిజమే అయినా.. ఆక్రమణలు కళ్లముందే కనిపిస్తున్నా.. రేవంత్ రెడ్డి మాదిరిగా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే.. ఏపీలో కనిపించడం లేదు.
ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నవారు.. ఇప్పుడు కూడా యాక్టివ్‌గా ఉన్నారు. కూటమి సర్కారును ఏర్పాటు చేయడంలోనూ వారి పాత్ర కీలకం. హైదరాబాద్‌లో మాదిరి రాజకీయం ఇక్కడ పని చేసే పరిస్థితి లేదు. అందుకే.. జగన్ ఎన్నో ప్రయోగాలు చేసినా.. ఇక్కడ సక్సెస్ కాలేక పోయారు. ప్రజా వేదికను కూల్చేసిన తర్వాత.. అనేక నిర్మాణాలపై కసరత్తు చేశారు. కానీ, ఇంతలోనే పలువురు కీలక పారిశ్రామిక వేత్తలు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు.
ఆనాటి స్టే ఆర్డర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు దానిని పక్కనపెట్టి.. హైడ్రా వంటి సంస్థను తీసుకువచ్చినా.. చర్యలు మాత్రం శూన్యమేనని చెప్పాలి. కాబట్టి ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప.. కార్యాచరణ మాత్రం సాధ్యం కాదు. ఈ విషయం సర్కారు కు తెలియంది కాదు. అయితే.. ఇక,నుంచైనా ఆక్రమణలు తగ్గుతాయన్న ఉద్దేశంతోనే ఇలా ప్రకటించి ఉంటారన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 29, 2024 11:30 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…